పండుగ వచ్చిందని.. విపరీతంగా మద్యం తాగుతున్నారా.. మీకోసం సూపర్ న్యూస్!

13 January 2025

samatha

పండుగ వస్తే చాలు, మందు బాబులకు ఉండే సంతోషం, ఆనందం అంతా ఇంతా కాదు. తమ చిన్న నాటి స్నేహితులను కలిసి మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

ఇక మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని  అందరికీ తెలుసు. అయినా ఎవరూ ఈ విషయాన్ని లెక్క చేయకుండా ఎక్కువగా మందు తాగుతూ ఉంటారు.

ఇలా ఎక్కువగా మద్యం సేవించడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా లివర్ దెబ్బతినడం వంటి సమస్య ఎక్కువగా ఉంటుంది.

దీంతో కొంత మంది మద్యాన్ని లిమిట్‌గా తీసుకుంటారు. అయితే ఎంత తాగినా మీ ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు రాకూడదు అంటే చిన్నటిప్ పాటించాలంటున్నారు,శాస్త్ర వేత్తలు. ఇంతకీ అది ఏమిటంటే?

మద్యం సేవించే సమయంలో పచ్చిమిర్చిని నంచుక తినాలంట. దీని వలన మీ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు వైద్యులు.

పచ్చిమిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా క్యాప్సైసిన్, మద్యం వలన కలిగే నష్టాలు తగ్గిస్తుందంట.

ఇక తినమన్నారు కదా అని అతి గా కాకుండా తగి మోతాదులో పచ్చిమిర్చిని తీసుకోవాలంట. లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మరి ఇంకెందుకు ఆలస్యం మీ బంధువులు, స్నేహితులతో కలిసి పండుగ ఎంజాయ్ చేస్తూ.. ఈ టిప్ కూడా ట్రై చేసి చూడండి.