AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daaku Maharaaj: డాకు మహారాజ్ ఊచకోత.. బాలయ్య సినిమా రెండురోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. తొలి రోజే రూ. 56 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి బాలయ్య స్టామినా ఏంటో చూపించింది.

Daaku Maharaaj: డాకు మహారాజ్ ఊచకోత.. బాలయ్య సినిమా రెండురోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
Daaku Maharaaj
Rajeev Rayala
|

Updated on: Jan 14, 2025 | 3:44 PM

Share

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ విజయాల పరంపర కొనసాగుతుంది. అఖండ సినిమాతో మొదలు పెట్టి వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇక ఇప్పుడు డాకు మహారాజ్. ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ మంచి విజయాన్ని అందుకుంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత దర్శకుడు బాబీ, అలాగే భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య చేసిన సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే డాకు మహారాజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చింది డాకు మహారాజ్.

ఇది కూడా చదవండి : ఏంటీ..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయినా.! అదికూడా తెలుగమ్మాయి

తొలి షో తోనే డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో ఇరగదీశాడు. అలాగే ఈ సినిమాలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించారు. డాకు మహారాజ్ సినిమాలో ప్రగ్య జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా నటించారు. అలాగే తమన్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ గా నిలిచిందని చూసిన ఆడియన్స్ అంటున్నారు. డాకు మహారాజ్ సినిమాతో మరోసారి బాలకృష్ణ బాసఫీస్ దగ్గర సత్తా చాటారు. ఈ సినిమా తొలి రోజే బాగా కలెక్ట్ చేసింది.

ఇది కూడా చదవండి :Srihari: వాడు నా అయ్య..! శ్రీహరి నాన్న అని పిలిచే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా.?

డాకు మహారాజ్ తొలి రోజే రూ. 56 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి బాలయ్య స్టామినా ఏంటో చూపించింది. ఇక రెండో రోజు కూడా భారీగానే రాబట్టింది ఈ సినిమా.. ఈమేరకు మూవీ మేకర్స్ డాకు మహారాజ్ సెకండ్ డే కలెక్షన్స్ పోస్టర్  ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ సినిమా రూ. 74కోట్లకు పైగా గ్రాస్ సొంతం చేసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్ ఈ సినిమాను వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక బాలకృష్ణ ఈ సినిమాలో మరోసారి తన నటవిశ్వరూపం చూపించారు. ముఖ్యంగా యాక్షన్స్ సీన్స్ లో బాలకృష్ణ ఇరగదీశారనే చెప్పాలి. మొత్తంగా డాకు మహారాజ్ సంక్రాంతికి భారీ హిట్ అందుకుంది.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా