10 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరో సరసన నయనతార.. మళ్లీ క్రేజీ కాంబో రిపీట్

Rajitha Chanti

Pic credit - Instagram

02 November 2026

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆన్-స్క్రీన్ కేమిస్ట్రీతోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలోని వార్తలతోనూ విపరీతమైన సంచలనం సృష్టించిన జోడీ అది.

శింబు, నయనతార. సౌత్ ఇండస్ట్రీలో అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే చాలు అప్పట్లో ప్రేక్షకుల్లో, మీడియాలో భారీ అంచనాలు ఉండేవి

దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రేజీ స్టార్స్ మళ్లీ ఒకే స్క్రీన్‌ను షేర్ చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

యువ దర్శకుడు కీర్తీశ్వరన్ దర్శకత్వంలో శింబు హీరోగా ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శింబు కథానాయికగా నటిస్తున్నాడు. 

ఇందులో శింబు పూర్తి మాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించినట్లు టాక్. 

ఇప్పటికే దర్శకుడు నయన్‌కు కథ వినిపించగా, ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

శింబు, నయనతార జోడీగా గతంలో వచ్చిన ‘వల్లవన్’, ‘ఇదు నమ్మ ఆళు’ (తెలుగులో సరదాగా అల్లరి) సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ముఖ్యంగా ‘వల్లవన్’ చిత్రంలో వీరిద్దరి జోడీకి యూత్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇదు నమ్మ ఆళు సినిమాలో ఈ ఇద్దరూ జోడిగా నటించి మెప్పించారు.