రికార్డులు కియ్రేట్ చేస్తోన్న మహా కుంభమేళా.. యూపీ సర్కార్‌కు వచ్చే ఆదాయం ఎంతో తెలుసా?
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా రికార్డులు కియ్రేట్ చేస్తోంది. మొదటి రోజే త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు. లక్షల సంఖ్యలో పుణ్యస్నానాలు చేశారు. 45 రోజుల పాటు సాగే మేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్‌గా జరుగుతోంది. మహా కుంభమేళాకు లక్షలాదిగా భక్తజనులు తరలివస్తున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే తొలిరోజు ఉదయం దాదాపు 60 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నాయి. 45రోజుల పాటు సాగే మెగా మహా కుంభమేళా 40వేల కోట్ల మేర జనభా వస్తారని అంచనా వేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మహా కుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తోందని అంచనా వేస్తున్నారు. తక్కువలో తక్కువ రూ. 2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని ఆశిస్తున్నారు.
మహాకుంభమేళాతో వ్యాపారం, ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. కుంభమేళాకు వచ్చిన ఒక్కో వ్యక్తి హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, తాత్కాలిక నివాస ప్రాంతాలు, ఆహారం, వస్తువులు, ఆరోగ్య సంరక్షణతోపాటు ఇతర సేవలకు కలిపి సగటున రోజుకు 5వేల రూపాయలు ఖర్చు పెడతారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ( సీఏఐటీ ) అధికారులు అంచనా వేస్తున్నారు. ఓన్లీ హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, తాత్కాలిక లాడ్జీల ద్వారానే 40వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ప్యాకేజీ ఫుడ్, నీరు, బిస్కెట్లు, జ్యూస్‌లు, భోజనం వంటి వాటితో మరో 20వేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది.
ఇక పూజాసామగ్రి, ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి వాటితో మరో రూ. 20వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి. టాక్సీలు, సరకు రవాణా సేవలతో రూ.10వేల కోట్లు, టూరిస్టు గైడ్‌లు, ట్రావెల్ ప్యాకేజీల వంటి వాటితో మరో రూ. 10వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని అంటున్నారు. మెడికల్ క్యాంపులు, ఇతర ఔషధాలతో రూ. 3వేల కోట్లు, ఈ టికెటింగ్, డిజిటల్ పేమెంట్లు, వైఫై, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో రూ. 1000 కోట్లు రానున్నాయి. అంతేకాదు ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలతో మరో 10వేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది.
ఇప్పటికే 2019లో జరిగిన ఆర్ధ కుంభమేళాకు 24కోట్ల మంది భక్తులు వచ్చారు. ఆర్థ కుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అప్పడు రూ. 1.2లక్షల కోట్లు సమకూరింది. ఈసారి 45రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. తద్వారా యూపీ రాష్ట్రప్రభుత్వానికి 2లక్షల కోట్ల రూపాయాల ఆదాయం వస్తుందంటున్నారు సీఏఐటీ అంచనా వేస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..