అత్తి పండ్లే కాదు వీటి ఆకులతోనూ ఆరోగ్య ప్రయోజనాలే.. 

13 January 2025

Pic credit-Pexel

TV9 Telugu

అత్తి పండ్ల గురించి విని ఉండవచ్చు. వీటిని పచ్చిగానూ,  డ్రై ఫ్రూట్స్‌గా కూడా వాడతారు. వీటిని ఏ విధంగా తిన్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే అంజూర పండ్లు మాత్రమే కాదు అంజీరా ఆకుల్లో కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?

అత్తి ఆకులు అద్భుతమైన పోషకాల గని. ఎందుకంటే ఇందులో అపారమైన యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి.

ఈ ఆకు రసంతో శరీరంలోని ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అంజూరపు ఆకులను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకల బలహీనతను నివారిస్తుంది.

ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఒక కప్పు నీటిలో అర టీస్పూన్ పొడిని కలిపి టీలాగా తాగవచ్చు.

ఈ ఆకులను టీ గా లేదా డికాషన్ తాగడం వల్ల  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనాలు రుజువు చేశాయి