జుట్టు పట్టుకుచ్చులా సహజంగా పెరగాలా? మెంతి మొలకలు తినేస్తే సరి
13 January 2025
TV9 Telugu
TV9 Telugu
చూడ్డానికి చిన్నగా ఉన్నా, మెంతులతో ఆరోగ్యానికి చాలా లాభమని చెబుతున్నాయి పరిశోధనలు. ముఖ్యంగా నానబెట్టుకుని తీసుకుంటే ఫలితాలు అధికంగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
మెంతి గింజలతో ఊరగాయలు చేయడం మాత్రమే కాకుండా, ఎన్నో ఆరోగ్య సమస్యల నివారణలలో కూడా ఉపయోగపతాయి. అందుకే మెంతులను గుణాల నిధి అని అంటారు
TV9 Telugu
మెంతి గింజల్లో విటమిన్ ఎ, సి, కె, బి1, బి2, బి3, బి6, బి9 ఉంటాయి. సెలీనియం, మాంగనీస్, కాపర్, జింక్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, ప్రోటీన్లు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి
TV9 Telugu
నానబెట్టిన మెంతుల్ని ఉదయాన్నే తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వీటిల్లోని పీచు పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరగడానికి సాయపడుతుంది
TV9 Telugu
మెంతి గింజలను ఆహారంలో ఉపయోగించడమే కాకుండా, మెంతులను నానబెట్టిన నీరు కూడా ఆరోగ్యానికి బలే మేలు చేస్తాయి. మీరెప్పుడైనా మెంతి గింజల మొలకలు తిని చూశారా?
TV9 Telugu
మెంతి గింజల మొలకలను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మెంతి గింజలు గ్యాస్, ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది
TV9 Telugu
మెంతి గింజల మొలకలు తినడం వల్ల రక్తహీనత నిరోధిస్తుంది. అందుకే రక్తహీనత ఉన్నవారు మెంతి గింజల మొలకలను తినాలి. మెంతులు శరీరంలోని చెడు కొలస్ట్రాల్ అయిన ఎల్‌డీఎల్‌ను నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
TV9 Telugu
మెంతి మొలకలను అల్పాహారంలో సలాడ్ లాగా తినవచ్చు. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెంతి గింజల మొలకలు తినడం వల్ల స్కాల్ప్ చుండ్రు తగ్గుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు సహజంగా ఆరోగ్యంగా మారుతుంది