- Telugu News Photo Gallery Business photos Top recharge plans 84 days validity with best data check the details here
Recharge Plans: 84 రోజుల వ్యాలిడిటీతో డేటా, ఉచిత కాల్స్ వచ్చే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ మీ కోసం
ప్రస్తుతం ఉన్న బిజీ పనులలో ప్రతి నెల ప్రతినెలా రీఛార్జ్ చేసుకోవాలంటే కొంతమందికి చిరాకుగా ఉంటుంది.. అలా అని వేలు పెట్టి ఏడాది రీఛార్జులు చేసుకోవాలన్న కూడా కొద్దిగా కష్టమే.. అందుకే 84 రోజులపాటు వచ్చే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి.. వాటితో పాటు ఎంత డేటా వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Phani CH |
Updated on: Jan 13, 2025 | 8:40 PM

దాదాపు 3 నెలల పాటు రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది వద్దనుకుని 84 రోజుల పాటు ఉండే తక్కువ ధరలో ప్లాన్ కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జియో రూ .799 ప్లాన్: jio 799 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్లో ప్రతిరోజూ 1.5 జీబీ డేటా , ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌తో లభిస్తాయి. అయితే రోజువారీ డేటా ప్లాన్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుందని గుర్తుంచుకోండి. ఈ ప్లాన్లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

బీఎస్ఎన్ఎల్ రూ.628 ప్లాన్: BSNL 628 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. రోజుకు 3 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.

ఎయిర్‌టెల్ రూ.509 ప్లాన్: airtel 509 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో అపరిమిత కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లతోపాటు 6జీబీ బల్క్ డేటా లభిస్తుంది. ఇంత డేటా అయిపోయిన తర్వాత ఒక్కో ఎంబీకి 50 పైసల ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ వినియోగదారులు అపరిమిత 5జీ డేటాకు అనర్హులు. ఈ ప్లాన్‌లో స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్‌ల నుండి హెచ్చరికలు, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

వీఐ రూ .509 ప్లాన్: VI 509 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో అపరిమిత కాలింగ్, వన్ టైమ్ 1000 ఎస్ఎంఎస్‌లతో పాటు 6 జీబీ బల్క్ డేటా లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత ఒక్కో ఎంబీకి 50 పైసల ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎంఎస్ కోటా ముగిసిన తర్వాత లోకల్‌కు రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్‌కు రూ.1.5 ఛార్జీ వసూలు చేస్తారు. ఈ ప్లాన్లో ఎలాంటి అదనపు బెనిఫిట్ ఉండదు.





























