- Telugu News Photo Gallery Business photos Jio recharge plan you will get this plan at a cheap price Mukesh Ambani big gift
Jio Recharge Plan: రిలయన్స్ జియో నుంచి రెండు చౌకైన ప్లాన్స్.. వ్యాలిడిటీ ఎక్కువే..!
Jio Recharge Plan: రిలయన్స్ జియో నుంచి రకరకాల రీఛార్జ్ ప్లాన్షను ప్రవేశపెడుతోంది. ఇటీవల రీఛార్జ్ ప్లాన్ష్ పెంచడంతో వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వెళ్తున్నారు. దీంతో వినియోగదారులను పెంచుకునేందుకు జియో చౌకైన ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో రెండు ప్లాన్ష్ అందుబాటులో ఉన్నాయి..
Updated on: Jan 14, 2025 | 4:04 PM

జియో వినియోగదారులు తక్కువ ధరకు దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్‌లను పొందుతున్నారు. అందుకే ఇప్పుడు ముఖేష్ అంబానీ వినియోగదారులకు ఎన్నో ఆఫర్లు కల్పిస్తున్నారు. జియో రీఛార్జ్ చేసుకుంటే, మీరు ప్లాన్‌లో అపరిమిత డేటా, జియో సినిమా సబ్‌స్క్రిప్షన్, అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. జియో ఈ రీఛార్జ్ ప్లాన్ మీకు 72, 84 రోజుల చెల్లుబాటును అందిస్తుంది.

జియో తన వినియోగదారులకు రెండు ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ రూ. 749, రూ.1029 ప్లాన్‌లలో అందిస్తోంది. అధిక వాలిడిటీతో రోజువారీ అపరిమిత డేటా. అలాగే దీనితో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి.


మీరు రోజంతా ఇంటర్నెట్‌లో మీరు 2 లేదా 3 GB కంటే ఎక్కువ ఉపయోగించలేరు. అదనంగా మీరు రోజుకు 100 SMSలను పొందవచ్చు. వినోదం కోసం, జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ యాక్సెస్ కూడా అందుబాటులో ఉంది.

రూ.1029 ప్లాన్: ఈ ప్లాన్‌లో మీకు 84 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు రెండు OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. మీరు ఈ ప్లాన్‌లో జియో సినిమా, అమెజాన్ ప్రైమ్ లైట్‌కి కూడా సభ్యత్వాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తం 168 GB డేటా ఉచితంగా లభిస్తుంది. మీరు రోజుకు 2GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉచితంగా లభిస్తాయి.





























