చుక్క కూరా అని తీసిపారేయకండి.. లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు!

చుక్క కూరా అని తీసిపారేయకండి.. లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు!

Samatha J

|

Updated on: Jan 13, 2025 | 10:08 PM

ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని, తరచూ ఆకు కూరలు తీసుకోమని ఆహార నిపుణులు చెబుతుంటారు. పోషకాలు అధికంగా ఉండే సూపర్‌ఫుడ్ లిస్టులో ఆకు కూరలు ముందుంటాయి. ఇవి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే, బరువు తగ్గడం నుండి కంటి ఆరోగ్యం వరకు అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఈరోజు చుక్కకూర వల్ల మన శరీరానికి కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. అసలు చుక్కకూర చేసే మేలు అంతా ఇంతా కాదు.

దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. చుక్కకూరలో క్యాలరీలు, కొవ్వు పదార్ధాలు తక్కువ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో పైబర్‌, పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్‌, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్దకం సమస్య ఉన్నవారు తరచూ చుక్కకూర తింటే మంచి ఫలితం ఉంటుంది. చుక్కకూరలో ఉండే అనేక రకాల పోషకాలు రోగనిరోధక శక్తిని మెరుగుపడేలా చేస్తాయి. ఇందులో క్యాలరీలు, కొవ్వు పదార్ధాలు తక్కువ ఉంటాయి కనుక బరువు తగ్గాలనుకునేవారికి చుక్కకూర మంచి ఆప్షన్‌. కంటిచూపు మెరుగుపరచడంలో చుక్కకూర అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. రేచీకటి ఉన్న వారు రోజూ తింటే సమస్య తగ్గుతుందంటున్నారు కంటి నిపుణులు. చుక్కకూరలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు వారంలో రెండుమూడుసార్లు దీనిని తింటే సమస్య తగ్గుతుంది. క్యాన్సర్‌ను తరిమికొట్టడంలో చుక్కకూర చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు.