నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బాస్..చిరుతకే చుక్కలు చూపించాడుగా!
సాధారణంగా ఎవరైనా చిరుతను చూస్తే ఏం చేస్తారు. వెంటనే అక్కడి నుంచి పరుగు అందుకుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం చిరుతను చూసి పరిగెత్తకుండా దాని తోకను పట్టుకుని చుక్కలు చూపించాడు. ఈ ఘటన కర్ణాటకలోని రంగపురలో చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలోని తుమకూరు జిల్లా తిప్టూరు తాలూకాలోని రంగపుర గ్రామంలో ఐదు రోజులుగా చిరుతపులి గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేస్తోంది.
ఇక చిరుత పులి కనిపించడంతో గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి వచ్చిన అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేశారు. కానీ, బోను పెట్టి బంధించేందుకు ప్రయత్నించగా చిరుత తప్పించుకోవాలని చూసింది. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి చిరుతపులి తోకను పట్టుకుని, అది పారిపోకుండా నిలువరించాడు. అనంతరం అధికారులు వల సాయంతో దాన్ని పట్టి బంధించారు. అనంతరం దాన్ని బోనులో వేసి అక్కడ్నించి తరలించారు. తన సాహసోపేతమైన చర్యతో చిరుతను పట్టుకోవడానికి సహకరించిన అతడిని గ్రామస్థులు, అధికారులు అభినందించారు. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్ అవుతోంది. యువకుడి ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

