- Telugu News Photo Gallery Cinema photos Rakul Preet Singh miss ms dhoni movie chance for ramcharans Bruce Lee The Fighter
Rakul Preet Singh: ఆ టాలీవుడ్ హీరో కోసం ఎమ్.ఎస్ ధోని సినిమా వదిలేసినా రకుల్ ప్రీత్
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ గత కొన్నేళ్లుగా తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ బాలీవుడ్లో అడుగులు వేసి అక్కడ ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ నీ ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.
Updated on: Jan 13, 2025 | 8:53 PM

రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అందంతో, నటనతో తెలుగు ప్రజలను కట్టిపడేసింది ఈ చిన్నది. 18 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించి 2009లో కన్నడ చిత్రం 'గిల్లి'తో తన హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది.

ఆ తరువాత 2011 కెరటంలో సిద్ధార్థ్ రాజ్‌కుమార్ సరసన నటించింది, ఇది తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలైంది. ఆ తరువాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

ఇదిలా ఉండగా ఇటీవలే తాను ప్రేమించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానీ నీ ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు గ్లామర్ వలకబోస్తూ అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కానీ తన జీవితంలో ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నందుకు బాధపడ్డానని, అది కూడా స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని బయోపిక్ ఆధారంగా తెరకెక్కించిన ఎమ్మెస్ ధోని సినిమాలో నటించే అవకాశం వచ్చిందని, ఈ సినిమాలో తనని ఎంపిక చేశారని.. రామ్ చరణ్ తో బ్రూస్లీ సినిమాలో నటిస్తున్న సమయంలో.. ఆ సినిమాలో షూటింగ్ ఆలస్యం కావడం చేత.. డేట్లు అడ్జస్ట్ కాలేక ఎమ్మెస్ ధోని సినిమా నుంచి తప్పుకున్నానని వెల్లడించింది.

అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులు రకరకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తూ వైరల్ చేస్తున్నారు.




