Sankranthiki Vasthunam Twitter Review : సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్విట్టర్ రివ్వూ.. వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబో నవ్వించిందా…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో వెంకటేశ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతేడాది సంక్రాంతి పండక్కి సైంధవ్ సినిమాతో అలరించిన వెంకటేశ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది.

Sankranthiki Vasthunam Twitter Review : సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్విట్టర్ రివ్వూ.. వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబో నవ్వించిందా...?
Sankrathiki Vastunnam Twitt
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 14, 2025 | 7:00 AM

సైంధవ్ సూపర్ హిట్ తర్వాత హీరో వెంకటేశ్ నటించిన లేటేస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. విడుదలకు ముందే పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ద్వారా సినిమాపై ఆసక్తిని కలిగించారు మేకర్స్. అలాగే ఈసినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తోంది గోదారి గట్టు సాంగ్. ఈసినిమాలో వెంకటేశ్ పాడిన బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ అదిరిపోయింది. ప్రమోషన్లలో సైతం విభిన్న టాలెంట్ చూపిస్తూ ప్రేక్షకులను నవ్వించింది చిత్రయూనిట్. ఈ పండక్కి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చూసే సినిమా ఇది అని ఇటీవలే వెంకటేశ్ అన్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయ్యాయి. ఆల్రెడీ సినిమా చూసిన అడియన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే హిట్టు సినిమా అని.. ఎప్పటిలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి తన టిపికల్ మార్క్ కామెడీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని.. ముఖ్యంగా వెంకీమామ కామెడీ టైమింగ్ వర్కౌట్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుందట. మొత్తానికి ఈ పండక్కి థియేటర్లలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను అడియన్స్ ఎంజాయ్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేశ్ పెర్ఫార్మెన్స్ హైలెట్ అని.. ఆ తర్వాత బుల్లిరాజు క్యారెక్టర్ కామెడీ, అలాగే భీమ్స్ అందించిన పాటలు సినిమాకు మరింత బలం అని అంటున్నారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి యాక్టింగ్ బాగుందని పోస్టులు చేస్తున్నారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..