AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Suresh : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. ఇల్లు అమ్మేసి ఏడుస్తూ వెళ్తే.. నా జీవితాన్నే మార్చేశాడు.. నటుడు సురేష్..

ఒకప్పుడు తెలుగులో హీరోగా, విలన్ గా, సహయ నటుడిగా అలరించారు సురేష్. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలోని ఆర్థిక పోరాటాలు, ఇల్లు అమ్మకం గురించి వెల్లడించారు. ఆర్థికంగా బలహీనంగా మారిన సమయంలో ఒక వ్యక్తి ఇచ్చిన అవకాశంతో తన లైఫ్ మారిపోయిందని అన్నారు.

Actor Suresh : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. ఇల్లు అమ్మేసి ఏడుస్తూ వెళ్తే.. నా జీవితాన్నే మార్చేశాడు.. నటుడు సురేష్..
Suresh
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2026 | 8:29 PM

Share

నటుడు సురేష్ తన సినీ ప్రస్థానంలో ఎదురైన తీవ్రమైన ఆర్థిక పోరాటాలు, వృత్తిపరమైన సవాళ్లు, అలాగే దివంగత దిగ్గజ నిర్మాత రామానాయుడు అందించిన అమూల్యమైన అండ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తండ్రి, ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయినప్పటికీ, “రాముడు పరశురాముడు” చిత్రం కారణంగా 1980ల మధ్యలో భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నారని సురేష్ తెలిపారు. అప్పట్లో 34-35 లక్షల రూపాయల అప్పులను తీర్చడానికి సురేష్ ఆరేళ్ల పాటు నటుడిగా పనిచేయాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన కేవలం డబ్బుల కోసం తమిళంలో సంవత్సరానికి 18 చిత్రాల వరకు చేశానని, అవి తన కెరీర్‌కు అవసరం లేకపోయినప్పటికీ చేశానని అంగీకరించానని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

సురేష్ తనను తాను కేవలం ఒక స్టార్‌గా కాకుండా, డస్టిన్ హాఫ్‌మన్, రాబర్ట్ డి నీరో, అల్ పచీనో వంటి గొప్ప నటుల నుండి ప్రేరణ పొందిన పూర్తిస్థాయి నటుడిగా చూడాలనుకున్నానని తెలిపారు. రొమాంటిక్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, ఫ్యామిలీ స్టోరీస్, థ్రిల్లర్లు, యాక్షన్ చిత్రాలలో నటించాలని ఆయన కోరారు. అయితే, ఆయనతో లవ్ స్టోరీస్ మాత్రమే చేస్తామని, లేకపోతే వేరే హీరోని చూసుకుంటామని నిర్మాతలు స్పష్టం చేశారు. దీంతో, తన కళాత్మక ఆకాంక్షల కోసం సురేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 11 సినిమాలను తిరస్కరించి, నిర్మాణంలో ఉన్న తన ఇంటిని కూడా అమ్మేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయం వల్ల తమిళ చిత్ర పరిశ్రమలో సుమారు ఏడు-ఎనిమిది నెలలు పని లేకుండా పోయింది, ఎందుకంటే ఆయనను “కష్టం” అని భావించినట్లు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..

అలాంటి కష్ట సమయంలో హైదరాబాద్‌లోని సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయంలో రామానాయుడుని కలిశానని అన్నారు. తన ఆర్థిక స్థితిని గురించి కాకుండా, వైవిధ్యమైన పాత్రలు, మంచి వేషాలు కావాలని ఆయన నిజాయితీగా నాయుడుకి కోరినట్లు తెలిపారు. రామానాయుడు, సురేష్ తండ్రితో పరిచయం ఉన్నప్పటికీ, సురేష్‌ను “అంకుల్” అని కాకుండా “నాయుడు గారు” అనే గౌరవంగా పిలిచేవాడినని అన్నారు. తాను అవకాశం అడిగిన కేవలం 15-16 రోజుల తర్వాత, “పుట్టింటి పట్టుచీర” సినిమాలో హీరోగా అవకాశం లభించింది. ఈ సినిమా విజయం సురేష్ కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. నాయుడు సినిమా వల్ల పద్మాలయ సంస్థ నుండి “చిన్నకోడలు”, ఉషాకిరణ్ సంస్థ నుండి “మామాశ్రీ” వంటి చిత్రాలకు అవకాశాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు మూడు-నాలుగు నెలల్లో విడుదలై విజయవంతమయ్యాయి, సురేష్ కెరీర్‌కు తిరిగి జీవం పోశాయి. రామనాయుడు చేసిన సాయం జీవితంలో మర్చిపోలేనని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..

Follow Us
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?