ఆ చిన్న మార్పు చేసుంటే.. ఉస్తాద్ ఇంకా బాగా ఆడేది
పరుచూరి గోపాలకృష్ణ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై తన విశ్లేషణతో నెట్టింట వైరల్ అవుతున్నారు. స్క్రీన్‌ప్లే లోపాలు, హీరో ఎంట్రీ ఆలస్యం, కథ, టైటిల్‌కు మధ్య సమతుల్యత లోపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. యాక్షన్, ప్రేమకథల సమతుల్యతను సరిచేసి ఉంటే పవన్ కల్యాణ్ సినిమా ఇంకా బాగా ఆడేదని 'పరుచూరి పాఠాలు' ద్వారా వివరించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చిలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టింది. అయితే పవన్ కల్యాణ్ అభిమానులను బాగానే ఆకట్టుకున్న ఉస్తాద్ సినిమా కామన్ ఆడియెన్స్ ను మెప్పించడంలో కాస్త తడబడింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీని చూసిన ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై తన స్టైల్లో రివ్యూ ఇచ్చారు. తన విశ్లేషణతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. ‘పరుచూరి పాఠాలు’ పేరుతో కొత్త సినిమాలపై విశ్లేషణ చేస్తుంటారు పరుచూరి గోపాలకృష్ణ.తాజాగా ఈయన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా విశ్లేషణ చేశారు. ఉస్తాద్ సినిమాల్లోని స్క్రీన్‌ప్లే దోషాలను వివరించారు. అలాగే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఉంటే పవన్ సినిమా ఇంకా బాగా ఆడేదని అభిప్రాయపడ్డారు. అనారోగ్య కారణాలతో.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను థియేటర్లో చూడలేకపోయానంటూ తన వీడియో బిగినింగ్‌లో చెప్పిన పరుచూరి.. ఆ తర్వాత సినిమా స్టోరీని పాయింట్ టూ పాయింట్ వివరిస్తూ విశ్లేషించారు. సినిమా పేరు గంభీరంగా ఉందని.. స్వరాజ్యం, సమాజం కోసం పోరాడిన వ్యక్తి పేరు పెట్టడం బాగుంది కానీ.. సినిమా చూసిన తర్వాత కథ, కథనాలు మెయిన్ పాయింట్ నుంచి పక్కకు వెళ్లాయా? అనిపించిందన్నారు పరుచూరి. అనన్యను చంపేయడం అనేది ఒక షాకింగ్ పాయింట్ అని.. ప్రేక్షకులు వచ్చి సీట్లలో కూర్చోక ముందే ఆ సీన్ వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. అక్కడి నుంచి రెండు రకాల ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లతో ఉస్తాద్ కథ నడిచిందన్నారు. పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కమర్షియాలిటీని జోడించి ఈ సినిమాను తెరకెక్కించారన్నారు. పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకూడదని.. కానీ, ఇందులో పవన్ చాలా మందిని కాల్చేసినట్లు చూపించారన్నారు. ఈ విషయంలో హరీశ్ కొన్ని జాగ్రత్తలు తీసుకుని, సాధారణ విలన్‌లను కాకుండా ఉగ్రవాదుల్ని తీసుకొచ్చాడని, దీంతో కాల్చింది తప్పు కాదన్న భావన హరీశ్ ప్రేక్షకుడిలో కలిగించాడని.. పరుచూరి విశ్లేషించారు. ఇక ఉస్తాద్ పోలీస్ ఆఫీసర్ కథ కాదని చెప్పేలా సెకండాఫ్‌లో ఒక ప్రేమ కథను కూడా జోడించారు. అయితే ఇక్కడే చిన్న పొరపాటు చేశారన్నారు పరుచూరి. ప్రథమార్ధంలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంది కాబట్ట సెకండాఫ్ లో లవ్‌సీన్స్ పెద్దగా చూడబుద్ది కాలేదంటూ పరుచూరి విశ్లేషించారు. కొంత లవ్‌స్టోరీని ఫస్ట్ హాఫ్‌లో వాడుకోవాల్సిందని పరుచూరి అభ్రిప్రాయపడ్డారు. పవన్ లాంటి స్టార్ హీరో మూవీని చూడటానికి థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు ఎప్పుడు హీరోను చూద్దామా అని అనుకుంటారని.. కానీ ఈ సినిమాలో దాదాపు 20 నిమిషాల తర్వాత కూడా పవన్ కనిపించకపోవడం మైనస్ అన్నారు పరుచూరి. హీరో ఎంట్రీ లేటైతే, సినిమాకు ప్రమాదమని మరోసారి గుర్తు చేశారు. ఇక పార్తిబన్‌ను విలన్‌గా ఒప్పించడం సాహసమనే చెప్పుకోవచ్చన్నారు. ఆ పాత్రను ముగించిన తీరు కూడా బాగుందని చెప్పారు. సాధారణంగా ఇలాంటి కథలు రాసుకున్నప్పుడు టైటిల్స్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇందులో పవన్ పాత్ర కాస్త రౌడీ ఇన్‌స్పెక్టర్‌ను పోలి ఉంటుందని.. ‘భగత్ సింగ్’ స్వరాజ్యం కోసం పోరాటం చేసి, ప్రాణత్యాగం చేశాడు. అందుకే ఈ మూవీకి ఇంకేదైనా పేరు పెట్టి ఉంటే ప్రేక్షకుడి ఆలోచన మరోలా ఉండేదేమో ‘ అని తనదైన శైలిలో విశ్లేషించారు పరుచూరి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kalyan Padala: హీరోగా కళ్యాణ్ పడాల.. మొదటి అడుగు పడింది
Mangli: పక్కా ప్రణాళిక.. 200కోట్ల వసూళ్లు.. కానీ నాకేం సంబంధం లేదంటున్న మంగ్లీ
Akshay Kumar: స్టార్ హీరో కూతురికి వేధింపులు..
Varanasi: ‘వారణాసి’ స్పెషల్ వీడియో.. ఫ్యాన్స్‌కు నిరాశ
వివాదంలో అనుష్క శర్మ.. చేతులతో అసభ్యకరమైన సైగలు.. ఫ్యాన్స్ ఆగ్రహం
వామ్మో.. ఇన్ని బైకులు కొట్టేశారేంట్రా.. షోరూమ్ పెడతారా ఏంటి?
మనుషులైన, మూగ జీవులకైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే గురూ..
560 రోజులుగా 400 అడుగుల ఎత్తయిన టవర్ పైనే.. కారణం ఇదే!
సింధు కణతపై ఏమిటా స్టిక్కర్..!
వామ్మో.. అతని ఒంటి నిండా తేనెటీగలే..!
యూట్యూబ్ వీడియోలతో కోట్లు కొల్లగొడుతున్న స్టార్లు
శ్రీవారినిజీవితంలో ఒక్కసారైనా..ఇలా చూశారా?

