AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyan Padala: హీరోగా కళ్యాణ్‌ పడాల.. మొదటి అడుగు పడింది

Kalyan Padala: హీరోగా కళ్యాణ్‌ పడాల.. మొదటి అడుగు పడింది

Phani CH
|

Updated on: Apr 27, 2026 | 5:43 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల తన సినీ ప్రయాణంలో తొలి అడుగు వేశారు. 'నిజమే రుజువైనది' అనే మ్యూజిక్ వీడియోతో అరంగేట్రం చేశారు. బిగ్ బాస్ తమిళ్ కంటెస్టెంట్ వియానా తో కలిసి నటించిన ఈ పాట ప్రోమో విడుదల కావడంతో అభిమానుల్లో ఉత్సాహం నిండింది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీతో కళ్యాణ్ పడాల సినీ రంగంలో రాణించాలని ఆశిస్తున్నారు.

ఆర్మీ జవాన్ అంటూ.. బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల.. అక్కడ జడ్జిలను ఇంప్రెస్ చేసి.. బిగ్ బాస్‌ సీజన్‌ 9లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లో మొదట తడబడిన ఈ జవాన్.. ఆ తర్వాత తన గేమ్‌ను సరిచేసుకుని.. హౌస్లో దూసుకుపోయాడు. ఎవ్వరికీ అందనంత ఓటింగ్‌తో.. ప్రతీ వారం తన గ్రాఫ్ పెంచుకుంటూ.. చివరికి సీజన్ 9 విన్నర్ గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ ద్వారా తనకు వచ్చిన క్రేజ్‌తో.. సినిమాల్లో రాణించాలని ఆశపడుతున్న కళ్యాణ్ పడాల.. ఇప్పుడు తన మొదటి అడుగు వేశాడు. ఓ మ్యూజిక్ వీడియోలో నటించాడు. ఇప్పుడా మ్యూజిక్ వీడియో ప్రోమో రిలీజ్ అయింది. ‘నిజమే రుజువైనది’ అంటూ సాగే ఈ మధురమైన సాంగ్‌లో… కళ్యాణ్ పడాలతో పాటు.. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 కంటెస్టెంట్ కమ్ మోడల్ వియానా నటించింది. జె.వి సుధాన్షు,వందన,సాత్విక్ కొండెపూడి ఈ మెలోడీ సాంగ్‌ను కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌కు రైటర్,డైరెక్టర్,డీవోపీ కే ప్రకాశ్ రెడ్డి. ప్రస్తుతం ఈ మ్యూజిక్ ప్రోమో అందర్నీ ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ పడాల వేసిన తన మొదటి అడుగు విజయవంతం అవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mangli: పక్కా ప్రణాళిక.. 200కోట్ల వసూళ్లు.. కానీ నాకేం సంబంధం లేదంటున్న మంగ్లీ

Akshay Kumar: స్టార్ హీరో కూతురికి వేధింపులు..

Varanasi: ‘వారణాసి’ స్పెషల్‌ వీడియో.. ఫ్యాన్స్‌కు నిరాశ

వివాదంలో అనుష్క శ‌ర్మ.. చేతుల‌తో అసభ్యకరమైన సైగ‌లు.. ఫ్యాన్స్ ఆగ్రహం

యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న సినీజనాలు

Follow Us