వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఉస్తాద్ భామ.. రాశి ఖన్నా లేటెస్ట్ పిక్స్ 

Rajeev 

27 April 2026

instagram

ఆఫర్స్ అందుకుంటూ తెలుగులో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో అందాల భామ రాశీఖన్నా ఒకరు.

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

అలాగే అందం, నటన పరంగాను రాశీ ఖన్నాకు మంచి మార్కులు పడ్డాయి.ఇక రాశీ ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.

యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంది.

తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలోనూ నటించింది. ఆ మధ్య బాలీవుడ్ కు చెక్కేసింది. హిందీలో ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది.

దాంతో ఇప్పుడు బాలీవుడ్ పైనే ఈ చిన్నది ఫోకస్ పెడుతుంది. దాంతో రాశీ ఖన్నా టాలీవుడ్ కు దూరం అవుతుంది అని అంటున్నారు కొందరు అభిమానులు.

ఇక ఇటీవలే తెలుగులోనూ వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.