సాలిడ్ హిట్ కోసం నభా నటేష్ ఎదురుచూపులు.. 

Rajeev 

27 April 2026

instagram

హీరోయిన్ గా బిజీ అవ్వడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది ఆ అందాల భామ నభా నటేష్.. నన్నుదోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

2018లో వచ్చిన నన్నుదోచుకుందువటే సినిమా కంటే ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార.

ఇక పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందీ ముద్దుగుమ్మ. ఇస్మార్ట్ శంకర్ తన అందం నటనతో ఆకట్టుకుంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది నభా. ఆతర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో కనిపించింది.

డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాల్లో నభా నటేష్ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.

అదే సమయంలో ప్రమాదానికి గురవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు తిరిగి కోలుకొని సినిమాలు చేయాలని చూస్తుంది.

మొన్నామధ్య చేసిన డార్లింగ్ సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం నిఖిల్ తో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.