AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..? మీ జేబుకు చిల్లు పడకముందే ఇవి తెలుసుకోండి..

ప్రస్తుత డిజిటల్ కాలంలో బ్యాంకింగ్ సేవలు మన అరచేతిలోకి వచ్చేశాయి. వివిధ అవసరాల కోసం వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు తెరవడం ఇప్పుడు సర్వసాధారణం. అయితే సౌకర్యం కోసం తెరిచిన ఈ ఖాతాలే ఇప్పుడు చాలామందికి భారంగా మారుతున్నాయి. మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ నుంచి పెరుగుతున్న సైబర్ మోసాల వరకు.. అనేక బ్యాంక్ ఖాతాలను నిర్వహించడం ఇప్పుడు ఒక సవాలుగా మారింది.

ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..? మీ జేబుకు చిల్లు పడకముందే ఇవి తెలుసుకోండి..
Disadvantages Of Having Multiple Bank Accounts
Krishna S
|

Updated on: Apr 27, 2026 | 8:49 PM

Share

ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే పెద్ద టాస్క్.. గంటల తరబడి క్యూలో నిలబడాలి. కానీ ఇప్పుడు డిజిటల్ విప్లవం పుణ్యమా అని, ఆధార్ నంబర్ ఉంటే చాలు ఐదు నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ నుంచే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోతోంది. ఉద్యోగం మారినప్పుడల్లా కొత్త శాలరీ అకౌంట్లు తెరవడం, ఆకర్షణీయమైన ఆఫర్ల కోసం వివిధ బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించడం ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారింది. అయితే ఈ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ సంస్కృతి మీ ఆర్థిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా? ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మినిమమ్ బ్యాలెన్స్

ప్రైవేట్ బ్యాంకులు ప్రస్తుతం కనీస నిల్వ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నాయి. పట్టణాల్లో ఈ పరిమితి రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు ఉంటోంది. మీ వద్ద 5 ఖాతాలు ఉంటే, వాటిలో కనీస నిల్వ మెయింటైన్ చేయడానికే కనీసం రూ. 50,000 మీ అకౌంట్లలో ఉండాలి. ఒక్క రూపాయి తగ్గినా సరే బ్యాంకులు భారీగా పెనాల్టీలు విధిస్తాయి. మీరే గమనించకుండా మీ సొంత డబ్బును బ్యాంకులు ఫీజుల రూపంలో కట్ చేస్తూ ఉంటాయి.

వార్షిక ఛార్జీల మోత

ప్రతి బ్యాంక్ ఖాతాకు డెబిట్ కార్డు ఉంటుంది. దీనికి వార్షిక నిర్వహణ ఫీజు ఉంటుంది. మీరు వాడకపోయినా ప్రతి ఏడాది ప్రతి కార్డుకు రూ. 150 నుండి రూ. 500 వరకు చెల్లించాల్సి వస్తుంది. ఎస్ఎంఎస్ అలెర్ట్ చార్జీలు అదనం. ఖాతాలు పెరిగే కొద్దీ ఈ అనవసరపు ఖర్చులు కూడా వేలల్లోకి చేరుతాయి.

ట్రాకింగ్ చేయడం నరకం

మీ దగ్గర ఎన్ని ఖాతాలు ఉంటే, అన్ని పాస్‌వర్డ్‌లు, లావాదేవీల రికార్డులను గుర్తుంచుకోవాలి. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు అన్ని ఖాతాల స్టేట్‌మెంట్లు సేకరించడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. మీ అసలు ఆదాయం ఎంత? మీరు ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారు? అనే దానిపై మీకు స్పష్టత ఉండదు. దీనివల్ల ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయి.

సైబర్ నేరగాళ్లకు సులభమైన వేట

వాడకుండా వదిలేసిన ఖాతాలు సైబర్ మోసాలకు కేంద్ర బిందువులు. మీరు ఎప్పుడో వాడిన పాత అకౌంట్ పై నిఘా ఉంచరు. ఒకవేళ అందులో ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగినా మీకు వెంటనే తెలియదు. ఫోన్‌కు వచ్చే వందల కొద్దీ బ్యాంక్ నోటిఫికేషన్ల మధ్య ఏది మీ మెయిన్ అకౌంట్ మెసేజ్, ఏది ఫేక్ మెసేజ్ అని గుర్తించడం కష్టమవుతుంది.

సిబిల్ స్కోర్‌పై ప్రభావం

అనేక ఖాతాలు ఉండి, వాటిలో కనీస నిల్వ లేక పెనాల్టీలు పడుతుంటే అది మీ బ్యాంకింగ్ హిస్టరీపై ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీరు చేయాల్సిన ఆర్థిక ప్రక్షాళన

లిస్ట్ సిద్ధం చేసుకోండి: ప్రస్తుతం మీకు ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో ఒక పేపర్‌పై రాయండి.

అవసరమైనవి ఉంచుకోండి: మీ ప్రస్తుత శాలరీ అకౌంట్, ఒక సేవింగ్స్ అకౌంట్.. ఈ రెండు ఉంటే సరిపోతుంది.

మిగిలినవి క్లోజ్ చేయండి: అసలు వాడటమే మానేసిన లేదా తక్కువ డబ్బు ఉన్న పాత ఖాతాలను వెంటనే ఆయా బ్యాంకులకు వెళ్లి మూసివేయండి.

ఆటో డెబిట్లను చెక్ చేయండి: ఏదైనా ఇన్సూరెన్స్ లేదా బిల్లులు పాత ఖాతా నుంచి కట్ అవుతుంటే వాటిని మెయిన్ అకౌంట్‌కు మార్చండి.

Follow Us