AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు రూ.115 దాచుకుంటే చాలు.. చేతికి లక్షలే.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?

సంపాదించడం ఒక ఎత్తయితే.. దాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మరో ఎత్తు. చాలా మంది సామాన్యులు వారు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు దాచలేక వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీస్ ద్వారా ఒక సూపర్ స్కీమ్‌ను అందిస్తోంది. కేవలం రోజువారీ జేబు ఖర్చులంతోనే మొత్తంతో ఐదేళ్లలో లక్షల రూపాయలు ఎలా సంపాదించవచ్చో తెలుసుకుందాం..

రోజుకు రూ.115 దాచుకుంటే చాలు.. చేతికి లక్షలే.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?
పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం అంటే ఏమిటి? రికరింగ్ డిపాజిట్ పథకం. ఇది ఒక ప్రభుత్వ పొదుపు పథకం. దీని ద్వారా మీరు ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేయవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే, క్రమంగా పొదుపు చేయాలనుకునే వారికి ఈ పథకం అనువైనది. ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు (60 నెలలు). మీరు నెలకు కనీసం రూ. 100తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. దీనిపై వచ్చే వడ్డీని త్రైమాసికంగా లెక్కించి జమ చేస్తారు (చక్రవడ్డీ పద్ధతి). ప్రభుత్వం నిర్ధారించిన వడ్డీ రేటు ఆధారంగా ఆదాయం లభిస్తుంది.
Krishna S
|

Updated on: Jun 23, 2026 | 4:45 PM

Share

ప్రస్తుతం కాలంలో పిల్లల చదువులు, పెళ్లిళ్లకు పొదుపు అనేది కంపల్సరీగా మారింది. జీవితంలో ఆర్థిక భద్రత అనేది చాలా ముఖ్యం. సంపాదించిన డబ్బును సంపాదించినట్లు ఖర్చు చేసుకుంటూ పోతే.. భవిష్యత్తులో అనుకోని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు చేతులు చాచాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ పొదుపు చేయడం లేదా సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేము అనుకునే సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీస్ ద్వారా ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. అదే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్. ఈ స్కీమ్‌లో ప్రతిరోజూ కేవలం రూ.115 పొదుపు చేయడం ద్వారా లక్షల్లో ఎలా రాబడి పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

చిన్న మొత్తాల పొదుపు.. పెద్ద మొత్తం లాభం..

చాలా మంది తాము పెద్ద మొత్తంలో డబ్బును ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేమని భావించి పొదుపునకు దూరంగా ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ పోస్టల్ రికరింగ్ డిపాజిట్ పథకాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఇందులో మీరు ప్రతి నెలా ఒక చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతూ స్థిరమైన, సురక్షితమైన రాబడిని సొంతం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండే పథకం కాబట్టి ఇందులో మీ డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు. పూర్తి సురక్షితంగా ఉంటుంది.

రోజుకు రూ.115 ఇన్వెస్ట్ చేస్తే.. నెలకు రూ.3,500..

ప్రస్తుతం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంపై ప్రభుత్వం 6.7 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ లెక్కన మీరు ప్రతిరోజూ కేవలం రూ.115 పక్కన పెడితే.. నెలకు రూ.3,500 అవుతుంది. ఈ మొత్తాన్ని మీరు ప్రతి నెలా ఆర్‌డీ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.

5 ఏళ్లలో రూ. 2.5 లక్షల రాబడి ఎలా అంటే?

పోస్టాఫీస్ ఆర్‌డీ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. అంటే మీరు 60 నెలల పాటు నిరంతరంగా ప్రతి నెలా రూ.3,500 పెట్టుబడి పెట్టాలి.

  • మీరు పెట్టే మొత్తం పెట్టుబడి: రూ. 2,10,000
  • 6.7శాతం వడ్డీ రేటు ప్రకారం వచ్చే వడ్డీ: రూ. 39,000
  • మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి వచ్చే మొత్తం: రూ. 2,49,000

అంటే కేవలం రోజుకు రూ. 115 చొప్పున మీ జేబు ఖర్చులను తగ్గించుకుని పొదుపు వైపు అడుగులు వేస్తే.. 5 ఏళ్లలో తిరిగేసరికి మీ చేతిలో దాదాపు రెండున్నర లక్షల రూపాయల పెద్ద మొత్తం ఉంటుంది. ఈ డబ్బు మీ పిల్లల చదువులకు, అత్యవసర వైద్య ఖర్చులకు లేదా ఇతర అవసరాలకు ఎంతో అండగా నిలుస్తుంది.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి