వివాహ బంధంలోకి అడుగు పెట్టిన F2 బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్

samatha

27 April 2026

నటి మెహ్రీన్ ఫిర్జాదా మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఈ ముద్దుగుమ్మ ఏప్రిల్ 26 ఆదివారం రోజున వివాహం చేసుకుంది.

మెహ్రీన్

తన ప్రియుడు అర్ష్ ఔలఖ్‌‌ను హిమాచల్ ప్రదేశ్‌లో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఈ అమ్మడు తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి వైరల్‌గా మారాయి.

ప్రియుడితో పెళ్లి

మెహ్రీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. చాలా సినిమాల్లో నటించి మెప్పించినప్పటికీ ఈ బ్యూటీకి లక్కు కలిసి రాలేదని చెప్పాలి.

అందం, అభినయం

తన అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన మేర అవకాశాలు రావడం లేదు. ముఖ్యంగా తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ బ్యూటిపుల్ ఫోటోస్ షేర్ చేస్తుంది.

ఫొటోస్

అయితే ఈ చిన్నది తాజాగా తన వెడ్డింగ్ ఫొటోస్ షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. ఇందులో ఈ అమ్మడు సంప్రదాయంగా చాలా అందంగా రెడీ అయ్యింది, ప్రతి ఒక్కరి చూపును ఆకర్షించుకునేలా ఉంది.

వెడ్డింగ్ ఫొటోస్

లేత గులాబీ రంగు లెహంగాలో చాలా స్టైలిష్ లుక్‌లో కనిపించింది. అంతే కాకుండా లేయర్డ్ స్టోన్ నెక్లెస్, దానికి సరిపోయే చెవి కమ్మలను ధరించి, చాలా అందంగా ఉంది.

లేత గులాబీ రంగు

అంతే కాకుండా అర్ష్ లుక్ కూడా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. లేత గులాబీ రంగు దుస్తుల్లో అందమైన రూపంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాడు.

అర్ష్ లుక్

ప్రస్తుతం ఈ కొత్త జంటకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ బ్యూటిపుల్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ ఫొటోస్