PM Modi: ఆనందం, ఆరోగ్యమివ్వాలి.. ఢిల్లీలోని సంక్రాంతి వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నివాసంలో సోమవారం జరిగిన సంక్రాంతి, పొంగల్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రధాని మోదీ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రయ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, నయాబ్ సింగ్ సైనీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi: ఆనందం, ఆరోగ్యమివ్వాలి.. ఢిల్లీలోని సంక్రాంతి వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ
Pm Modi
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 14, 2025 | 6:59 AM

ఢిల్లీలోని నరైనా‌లో జరిగిన లోహ్రి వేడుకలకు హాజరయ్యారు ప్రధాని మోదీ. ముఖ్యంగా ఉత్తర భారతావని ప్రాముఖ్యమైన ఈ లోహ్రి పండుగను.. అక్కడి ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వ్యవసాయం, కష్టించి పనిచేసే రైతులకు ముడిపడిన ఈ పండుగ.. అందరిలోనూ ఆశను చిగురుస్తుందని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

నరైనాలో జరిగిన లోహ్రి వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువకులు, మహిళలు పాల్గొన్నారని ప్రధాని మోదీ అన్నారు. “ప్రతి ఒక్కరూ ఆనందంగా, మంచి ఆరోగ్యంతో ఉండాలని.. ముందంతా సంపన్నమైన పంటల సీజన్‌ను కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే ప్రతీ ఒక్కరికి సంక్రాంతి, పొంగల్‌ శుభాకాంక్షలు చెప్పారాయన.

మరోవైపు సోమవారం కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు, నటుడు చిరంజీవి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సహా పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ అంశంపైనా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తన మంత్రివర్గ సహచరుడు కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు హాజరయ్యాయని.. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని చూశానని పేర్కొన్నారు.