పెళ్లి రిసెప్షన్.. నమ్రత, చరణ్,ఉపాసన హంగామా
అదేదైనా ఈవెంటే కానీ.. గ్యాదరింగే కానీ.. చివరికి పెళ్లే కానీ.. సెలబ్రిటీలు హంగామా చేశారంటే.. అది నెట్టింట వైరల్ అవ్వాల్సిందే.. అందరి కళ్లూ అటు వైపు మళ్లాల్సిందే! ఇక ఇప్పుడు కూడా జరిగింది ఇదే..! టాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో.. టాలీవుడ్ స్టార్ హీరోలు.. వాళ్ల ఫ్యామిలీతో పాల్గొనడంతో.. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట తెగ కనిపిస్తున్నాయి.
అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎస్ ! టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి.. తన కొడుకు నితీశ్ రెడ్డి పెళ్లి వేడుకను దుబాయ్‌లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు.. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్‌తో సహా మహేష్ బాబు కూడా తమ ఫ్యామిలీస్‌తో కలిసి వెళ్లారు. నవ వధూవరులను ఆశీర్వదించారు. ఇక తాజాగా నితీశ్ రెడ్డి రిసెప్షన్ హైద్రాబాద్లో జరిగింది. దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన సమేతంగా వెళ్లారు. వీరి స్టార్ కపసుల్‌తో పాటు.. మహేష్ వైఫ్ నమ్రత తన కూతురు సితారతో కలిసి ఈ వేడుకలో మెరిసిపోయారు. కలివిడిగా తిరుగుతూ..అందరితో మాట్లాడుతూ.. హంగామా చేశారు. అంతేకాదు ఈ వేడుకలో దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశారు.. ఆ ఫోటోస్ కారణంగా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు వీరందరూ. !
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ranya Rao: ఈ బంగారు లేడీ వెనకున్న మంత్రి ఎవరు?
జాబిల్లిపై మరిన్ని చోట్ల మంచు కనుగొన్న చంద్రయాన్-3

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
