Ranya Rao: ఈ బంగారు లేడీ వెనకున్న మంత్రి ఎవరు?
బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ కన్నడ హీరోయిన్ రన్యా రావు అరెస్ట్ అవ్వడం ఇప్పటికీ.. త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ అంశంపై కర్ణాటక అసెంబ్లీలో రచ్చ రచ్చ జరిగింది. అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన నటి రన్యా రావు వెనుక ఉన్న మంత్రి ఎవరే విషయంపై సభలో తీవ్ర కలకలం రేగింది.
ఆమె వెనుక ఉన్నది ఎవరో బహిర్గతం చేయాలంటూ సభలోని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో కొద్ది సేపు తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ కేసు గురించి తనకు ఎటువంటి సమాచారం లేదని హోంమంత్రి చెబుతున్నారు. ఇక సభలోనూ ఇదే లైన్ రిపీట్ చేయడంతో.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మండిపడ్డారు. నటి రన్యా రావు కేసుకు సంబంధించి, బంగారం స్మగ్లింగ్ వెనుక ఉన్న మంత్రి ఎవరు? అని బీజేపీ ఎమ్మెల్యే పట్టుబడుతూ.. సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. అయితే సభలో మంత్రి ఎవరో చెప్పకపోయినా.. బంగారం అక్రమ రవాణా వెనుక బడా నేత ఉన్నట్లు సమాచారం. ఇక అసెంబ్లీ జీరో అవర్ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తిన కర్కల బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, బంగారం అక్రమ రవాణాకు పోలీసులే ప్రోటోకాల్ ఇచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనుక ఉన్న మంత్రి ఎవరో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని మాట దాటేశారు కర్ణాటక హోమంత్రి పరమేశ్వర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జాబిల్లిపై మరిన్ని చోట్ల మంచు కనుగొన్న చంద్రయాన్-3
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

