ఏలియన్స్ ఉన్నారు..! ఆ గ్రహంపై కనిపించారని సంచలన రిపోర్ట్
ఏలియన్స్.. అంటే గ్రహాంతర వాసులు.. ఈ పదం విన్నప్పుడల్లా ఏదో ఆసక్తి.. మనుషులు పోలిన మనుషులు ఈ విశ్వంలో ఎక్కడో ఓ చోట ఉన్నారనే ప్రచారం అనేక ఏళ్లుగా సాగుతూ ఉంది. అందుకే గ్రహాంతర జీవుల ఉనికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులకు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సువిశాల విశ్వంలో కేవలం మనుషులే కాదు, ఇతర జీవులు కూడా ఉన్నాయని చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు నమ్ముతారు.
వేరే ఎక్కడో గ్రహంతర వాసులు ఉన్నారని, భవిష్యత్తులో వాళ్లు మనతో స్నేహం లేదా యుద్ధం చేసే అవకాశం ఉందని కూడా చాలా మంది సైంటిస్టులు చెబుతుంటారు. ఈ విశ్వంలో ఏలియన్స్ కోసం కొన్నేళ్లుగా మనం వెతుకుతూనే ఉన్నాం. ఇప్పటికీ ఏలియన్స్ ఉన్నారనే ఒక స్పష్టమైన ఆధారం దొరకలేదు. కానీ, కచ్చితంగా ఏలియన్స్ ఉన్నారు అని మాత్రం చాలా మందిలో బలమైన నమ్మకం ఉంది. మన భూగ్రహం లానే ఈ విశ్వంలో వేరే గ్రహంపై కూడా మనుషులను పోలిన జీవం ఉంటుందని, వాళ్లను కనిపెట్టాలనే ఉత్సాహం శాస్త్రవేత్తల్లో కొన్నేళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. అయితే.. ఏలియన్స్ ఎక్కడో కాదు, మన సౌర కుటుంబంలోని అంగారక గ్రహంపైనే ఉన్నారని తాజాగా ఓ వ్యక్తి సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అతను సైంటిస్ట్ కాదు. అయినా కూడా అతని మాటలకు ఎందుకంత విలువ అంటే.. అతను గతంలో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

