ఆ ముద్దుగుమ్మపై చంద్రుడు మనుసు పడి నేల చేరుతాడేమో.. మెస్మరైజ్ వాణి..

ఆ ముద్దుగుమ్మపై చంద్రుడు మనుసు పడి నేల చేరుతాడేమో.. మెస్మరైజ్ వాణి.. 

image

14 March 2025

Prudvi Battula 

Credit: Instagram

28 అక్టోబర్ 1988న తమిళనాడులో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఊటీలో బడగ కుటుంబంలో జన్మించింది అందాల భామ వాణి భోజన్.

తమిళనాడు రాష్ట్రంలో ఉదగమండలం (ఊటీ)లోని బోర్డింగ్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ వయ్యారి భామ.

ఊటీలోని స్టోన్ హౌస్ హిల్‌లోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసింది.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మరియు ఇండిగోలో ఎయిర్ హోస్టెస్‌గా తన కెరీర్ ప్రారంభించి కరస్పాండెన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీని అభ్యసించింది.

ఆ తర్వాత ది చెన్నై సిల్క్స్ కోసం ఒక ప్రకటనలో మోడల్‌గా పని చేసే అవకాశాన్ని అందుకుంది. ఇది ఆమెకు యాక్టింగ్ ఆఫర్లను తీసుకొచ్చింది.

2010లో ఓర్ ఎరవూ అనే తమిళ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో తన పేరుకు బదులుగా హేవంతికగా క్రెడిట్ వచ్చింది.

2019లో మీకు మాత్రమే చెప్తా అనే తెలుగు కామెడీ డ్రామా చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం తమిళంలో పగైవణుకు అరుళ్వాయ్, క్యాసినో, ఆర్యన్ అనే మూడు చిత్రాల్లో కథానాయకిగా నటిస్తుంది ఈ వయ్యారి.

Vani Bhojan

Vani Bhojan