త్రిష ఉన్న వింత కోరిక మీకు తెలుసా.?

13 March 2025

Prudvi Battula 

త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దాదాపు 25 ఏళ్ళుగా సిల్వర్ స్క్రీన్ ని ఏలుతోంది త్రిష. 1999లో విడుదలైన జోడి మూవీలో చిన్న సపోర్టింగ్ రోల్‎లో చేసింది.

2002లో విడుదలైన మౌనం పెసియదే చిత్రంతో హీరోయిన్‎గా మారింది. అద్భుతమైన నటనతో వరుస ఆఫర్స్ అందుకుంది త్రిష.

తెలుగులో 2004 సంక్రాంతి కానుకగా విడుదలైన వర్షం త్రిషకు బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి ఆ ఏడాది సంక్రాంతి విన్నర్‎గా నిలిచింది.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, స్టాలిన్, కృష్ణ వంటి హిట్ చిత్రాలతో ఆమె తెలుగులో స్టార్ గా నిలదొక్కుకుంది. అటు తమిళ్ ఇటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది.

2015లో చెన్నై కి చెందిన వరుణ్ మణియన్ అనే బిజినెస్ మాన్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ పెళ్లిని త్రిష రద్దు చేసుకుంది. 41 ఏళ్ల త్రిష పెళ్లి మాట ఎత్తడం లేదు.

గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ కనీసం ఒక్కరోజైనా మగాడిగా ఉండాలని తన వింత కోరిక బయటపెట్టింది హీరోయిన్ త్రిష.

త్రిష మాటలు విన్న నెటిజెన్స్ వింత కామెంట్స్‎తో సందేహాలు వ్యక్తం చేయడంతో ఇది అప్పట్లో వైరల్‎గా మారింది.

అబ్బాయిగా మారాలన్న ఆమె కోరిక వెనకున్న రీజన్ ఏమిటో తెలియదు. అంతా అనుకున్నట్లు 2015లో త్రిషకు వివాహం జరిగితే తల్లి కూడా అయ్యేవారు.