ఆ ట్రోలింగ్ తట్టుకోలేకపోయాను: మృణాల్.. 

12 March 2025

Prudvi Battula 

సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్స్ లుక్స్, ఫిట్నెస్ పై నెట్టింట విమర్శలు వస్తుంటాయి. చాలామంది హీరోయిన్స్ బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నారు.

ఓసారి తనకు ఎదురైన అడ్డంకులు, బాడీషేమింగ్ కామెంట్స్ పై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పందించింది. ఎన్నోసార్లు ఒత్తిడికి గురైనట్లు తెలిపింది.

తన అందం విషయంలో ఎదురైన ట్రోలింగ్ తట్టుకోలేకపోయానని ఒక్కోసారి బయటకు రావడానికి కూడా ఇష్టపడని రోజులు ఉన్నాయని తెలిపింది.

ఎక్కువగా ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడ్డానని. ఒకటి, రెండు రోజులు గదిలోనే ఉన్నానని.. కొన్ని నెలలపాటు బాడీషేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నానని తెలిపింది.

ఇలాంటి ఎన్నో అనుభవాలను మీ కుటుంబం తప్ప మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరని.. చెడు రోజులు ఉంటే మంచి రోజులు వస్తాయని గుర్తుపెట్టుకోవాలని అన్నారు.

కానీ ఇప్పుడు ట్రోలింగ్, విమర్శలను అంతగా పట్టించుకోవడం లేదని అన్నారు. అలాగే బాడీ షేమింగ్ కామెంట్లను అంత సీరియస్ గా తీసుకోవడం లేదని చెప్పుకొచ్చింది.

అలాగే మానవ సంబంధాలు కష్టంగా మారాయని.. అందుకే తాను ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపింది. ప్రేమ, పెళ్లిపై ఎలాంటి నమ్మకాలు లేవని తెలిపింది.

టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది.