సాయి పల్లవి ఒక సినిమాకు ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా.?
11 March 2025
Prudvi Battula
ఫిదా సినిమాతో తెలుగు కుర్రాళ్ల హృదయాలను దొచేసింది సాయి పల్లవి. ఫస్ట్ మూవీతోనే స్టార్డమ్ సొంతం చేసుకుని న్యాచురల్ బ్యూటీగా క్రేజ్ అందుకుంది.
కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రస్తుతం అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. ఇటీవల తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణం పార్ట్ 1, రామాయణం పార్ట్ 2, ఏక్ దిన్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తుంది.
ఫిదా సినిమా కంటే ముందు మలయాళంలో బ్లాక్ బస్టర్ ప్రేమమ్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి.
అయితే ప్రేమమ్ సినిమా కోసం సాయి పల్లవి కేవలం రూ.10 లక్షలు మాత్రమే తీసుకుందట. ఇక తెలుగులో ఫిదా సినిమాకు రూ. 15 లక్షల తీసుకుందట.
ఇక ఆ వెంటనే మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాకు ఏకంగా రూ. 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంది. ఇప్పటివరకు సాయి పల్లవి రూ. 40 కోట్ల ఆస్తులు సంపాదించిందట.
అలాగే ఇప్పుడు ఒక్క సినిమాకు రూ. 3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. 53 లక్షల విలువైన ఆడి క్యూ 3 కారు కలిగి ఉన్నట్లు సమాచారం.
సాయి పల్లవి వద్ద మిత్సుబిషి లాన్సర్ ఎవో ఎక్స్, మారుతి సుజుకి నెక్సా వంటి కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. అయినా సింప్లిసిటి అంటే ఇష్టమట.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందుకే ఆ విషయం బయటపెట్టా: సామ్..
అప్పుడు గుండె బద్ధలైంది: తృప్తి దిమ్రి..
30 సెకన్లు యాడ్.. 5 కోట్లు పారితోషకం.. నయన్ మార్కెట్ మాములుగా లేదుగా..