తెలుగు కుర్రాళ్లను మైమరపించిన  మలయాళీ కుట్టిస్ వీరే..

11 March 2025

Prudvi Battula 

క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా మలయాళ భామే.. ఈ చిన్నది ఇప్పుడు చాలామంది కుర్రాళ్ళ ఫెవరెట్ హీరోయిన్.

భీమ్లానాయక్ సినిమాతో పరిచయమైన సంయుక్త మీనన్ కూడా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిందే. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తుంది.

కీర్తిసురేష్ మలయాళ కుట్టీనే.. నేను శైలజ సినిమాతో పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడువరుస సినిమాలతో బిజీగా మారింది.

నాని జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు పరిచయమైన మరో మలయాళీ కుట్టి నివేదా థామస్.. ఇటీవల 35 సినిమాలో ఆకట్టుకుంది.

అలాగే బబ్లీ బ్యూటీ నిత్యామీనన్ కూడా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. అలా మొదలైందితో పరిచయమైంది నిత్యా.

లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా మలయాళ భామనే.. కానీ ఆమె తమిళ్, తెలుగు సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ప్రియమణి కూడా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. తెలుగులో హీరోయిన్‎గా దాదాపు అందరి స్టార్ హీరోల పక్కన మెప్పించింది.

ఆసిన్ .. గజినీ సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ళ ఫెవరెట్ హీరోయిన్‎గా మారిపోయింది ఆసిన్. ఈ చిన్నది కూడా మలయాళ ముద్దుగుమ్మే.