AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆస్పత్రి బెడ్‌పై అలనాటి హీరోయిన్.. నుదుటిపై 13 కుట్లు.. ఏం జరిగిందంటే?

గతంలో పలు హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తోంది. హిందీతో పాటు తెలుగు తదితర దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అందాల తార ఆస్పత్రి బెడ్ పై కనిపించింది.

Tollywood: ఆస్పత్రి బెడ్‌పై అలనాటి హీరోయిన్.. నుదుటిపై 13 కుట్లు.. ఏం జరిగిందంటే?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Mar 14, 2025 | 8:48 AM

Share

ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించింది భాగ్యశ్రీ. సల్మాన్ ఖాన్ తో కలిసి మైనే ప్యార్‌ కియా అంటూ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఆ తర్వాత కొద్ది కాలానికే వ్యాపారవేత్త హిమాలయ్‌ దస్సానిని పెళ్లి చేసుకుని సినిమాలకు శాశ్వతంగా దూరమైంది. అయితే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాతో మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉంటోన్న ఈ అమ్మడు సడెన్ గా ఆస్పత్రి బెడ్ పై కనిపించింది. ఆమె నుదిటిపై తీవ్ర గాయమైంది. వైద్యులు చికిత్స చేసి భాగ్యశ్రీ నుదిటిపై 13 కుట్లు కూడా వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. దీనిపై నటి ఇంకా స్పందించలేదు. అదే సమయంలో భాగ్యశ్రీకి ఏమైందోనని సినీ అభిమానులు కంగారు పడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

కాగా షూటింగ్ సమయంలో భాగ్యశ్రీ గాయపడి ఉంటుందేమోనని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. కానీ అది నిజం కాదు. భాగ్యశ్రీకి పికిల్ బాల్ ఆట అంటే చాలా ఆసక్తి. ఇటీవల ఆమె పికిల్ బాల్ ఆడుతున్నప్పుడు ప్రమాదవశాత్తూ దెబ్బలు తగిలాయని తెలుస్తోంది. కాగా ఆపరేషన్ థియేటర్‌లో బెడ్ పై ఉన్న భాగ్యశ్రీ ఫోటో ను చూసి చాలా మంది కంగారు పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని త్వరలో కోలుకుంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రి లో భాగ్యశ్రీ..

భాగ్యశ్రీ 1989 లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆమె నటించిన మొదటి సినిమా ‘మైనే ప్యార్ కియా’. ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ తో కలిసి స్క్రీన్ పంచుకుందీ అందాల తార. మొదటి సినిమానే సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలోని నటనకు భాగ్యశ్రీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత తెలుగుతో పాటు బెంగాలీ, కన్నడ, భోజ్‌పురి, మరాఠీ వంటి భాషల్లోనూ మెరిసిందీ అందాల తార. ఇక చివరిగా లైఫ్‌ హిల్‌ గయూ అనే వెబ్‌ సిరీస్‌లో కనిపించింది.

భాగ్యశ్రీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Humara Apna (@humaraapnabyb)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..