Chandrababu Naidu: మాజీ మంత్రి జనార్థన్ రెడ్డికి సిఎం చంద్రబాబు ఆత్మీయ పలకరింపు
Nagam Janardhan Reddy: తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి ఎపి సిఎం చంద్రబాబు నాయుడును అమరావతిలో కలిశారు. నాగంను సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. నాగం గారూ... ఎలా ఉన్నారు.. ఆరోగ్యం ఎలా ఉంది.. చాలా రోజులు అయ్యింది కలిసి అంటూ పలకరించారు.
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి ఎపి సిఎం చంద్రబాబు నాయుడును అసెంబ్లీలో కలిశారు. చాలాకాలం తరువాత తనను కలిసిన నాగంను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. నాగం గారూ… ఎలా ఉన్నారు.. ఆరోగ్యం ఎలా ఉంది.. చాలా రోజులు అయ్యింది కలిసి అంటూ పలకరించారు. పిల్లలు ఏం చేస్తున్నారు అని ఆరా తీశారు. నాగం కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్న చంద్రబాబు…ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయనకు సూచించారు. ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం జనార్థన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా జనార్థన్ రెడ్డి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆనాటి కేసులను ఎట్టకేలకు కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. భేటీ సందర్భంగా ఇరువురు నేతలు పలు పాత ఘటనలను గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు చేసిన ప్రజా పోరాటాలను గురించి చర్చించుకున్నారు. నాగం ఫైర్ బ్రాండ్‌గా ఉండేవారని….పార్టీ ఆదేశిస్తే దూసుకుపోయేవాళ్లని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఎంతో ఎమోషన్‌గా ఉండేవారంటూ నాటి ఘటనలను ప్రస్తావించారు. నాలుగవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాగం ఈ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి…తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలనేదే తన అభిమతమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Thalapathy: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే! దెబ్బకు మైండ్ బ్లాక్ కదూ
శంకర్‌కు బిగ్ రిలీఫ్! ఆయన 11 కోట్ల ఆస్తుల జప్తుకు బ్రేక్
TOP 9 ET News: హనుమంతుడి గాథే… SSMB 29 ?? | రామ్ చరణ్‌తో బాలీవుడ్ ప్రొడ్యూసర్..ధమాకా దార్ ప్లాన్
అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి
సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు
సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి
ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్‌లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే

