జుట్టు సిల్కీగా పట్టుగా ఉండాలంటే ఇలా చేయండి
దట్టమైన, పొడవైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. అందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే అలోవెరా మీ జుట్టును సంరక్షించడంలో చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలోవెరా జెల్ జుట్టును మాయిశ్చైజ్ చేయడంలో సహాయపడుతుంది. జుట్టును మృదువుగా చేసి చిక్కులను తొలగిస్తుంది.
ఇందులోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కుదుళ్లకు చల్లదనం అందిస్తాయి. అలాగే కుదుళ్ల ఇన్ఫెక్షన్స్ నివారించి జుట్టు చివర్ల నుంచి ఆరోగ్యంగా ఉంచుతాయి. అలోవెరా జెల్‌లో విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు కావాల్సిన పోషణ అందించి వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు సహాయపడతాయి. అలోవెరాలోని గుణాలు తలలో చుండ్రును తొలగిస్తాయి. అలోవెరా జెల్ నేచురల్ కండిషనర్‌గా పనిచేస్తుంది. వెంట్రుకలను మృదువుగా, మెరిసేలా మారుస్తుంది. జుట్టుకు సహజమైన కాంతిని అందిస్తుంది. ఓన్లీ అలోవెరానే కాకుండా అరటిపండుతో కలిపి కూడా హెయిర్‌ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ మీ జుట్టును సిల్కీగా మారుస్తుంది. ఇందుకోసం బాగా పండిన అరటిపండును మెత్తగా గుజ్జులా చేసుకొని, దానిలో ఒక చెంచా తేనె కలిపి, అందులో అలోవెరా జెల్ వేసి మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. అనంతరం చల్లటినీటితో వాష్ చేసుకోవాలి. అరటిపండులో ఉండే పొటాషియం జుట్టుకు పోషణనిచ్చి మృదువుగా చేస్తుంది. అలోవెరాలో జుట్టుకు అవసరమైన పోషకాలు ఉంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సఫారీలో షాకింగ్ ఘటన.. జీప్‌లో నుంచి పడిపోయిన తల్లీకూతుళ్లు
ఈ ఫుడ్ తింటే.. వైరస్‌లు మీ జోలికి రావు..
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూసే అరటి పువ్వు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

