Remedies for Dry Eyes: కళ్లు పొడిబారి దురద పెడుతున్నాయా.. వెంటనే ఇలా చేయండి!
ఈ మధ్య కాలంలో చాలా మంది కళ్లకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కంప్యూటర్ సంబంధిత వర్క్ చేసేవారు, స్క్రీనింగ్ ఎక్కువగా చూసే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి..
ఇటీవల కాలంలో కంటి సంబంధిత సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం, ఫోన్ల వాడకం, టీవీలు చూడటం వల్ల కంటిపై ఒత్తిడి తీవ్రంగా పడుతుంది. దృష్టి లోపాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఉన్న నేతి తరం పిల్లలకు చిన్న వయసులోనే కళ్లద్దాలు పడుతున్నాయి. చిన్నారులు టీవీలు ఎక్కువగా చూడటం వల్ల కూడా కంటి చూపు మందగిస్తుంది. అంతే కాకుండా కళ్లు పొడిబారిపోయే సమస్య ఏర్పడుతుంది. కళ్లు అనేది ఎప్పుడూ తేమగా ఉండాలి. పొడి బారిపోతే సమస్యలు తప్పవు. కళ్లు ఆర్పకుండా కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్లు చూడటం వల్ల కళ్లు ఆర్పకుండా పని చేస్తారు. దీంతో కళ్లలో ఉండే ద్రవం త్వరగా ఆవిరైపోతుంది. దీంతో కళ్లు పొడిబారిపోతాయి. ఈ సమస్యను పట్టించుకోకపోతే.. ఎర్ర బడిపోయి.. తీవ్రంగా మంట, దురద వస్తాయి. ఆ తర్వాత కళ్లకే ప్రమాదం రావచ్చు. మీకు కళ్లు పొడిబారిపోయే సమస్య ఉంటే.. వెంటనే ఈ చిట్కాలను పాటించండి. ఇలా చేయడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు.
వేడి నీళ్లు:
కళ్లు పొడిబారిపోవడం వల్ల.. కంటి చూపు అనేది మందగిస్తుంది. దీంతో కళ్లద్దాలు ఏర్పడతాయి. కళ్లు మంట పుట్టి, దురదగా అనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి, చికిత్స తీసుకోవడం ముఖ్యం. ఒక వస్త్రాన్ని తీసుకుని వేడి నీటిలో ముంచి కళ్లను తుడుస్తూ ఉండాలి. కళ్లపై వస్త్రాన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా రోజులో రెండు, మూడు సార్లు చేయాలి. దీంతో కళ్లు పొడిబారడం, ఎరుపెక్కడం, దురద తగ్గుతాయి.
కీర దోశ:
కళ్లు ఎరుపెక్కినా, దురద పెట్టినా, పొడిబారిపోయినా కీర దోశను కోసి కళ్ల మీద ఉంచాలి. ఇలా చేయడం వల్ల కళ్లు రిలాక్స్ అవుతాయి. కళ్లు పొడిబారడం తగ్గుతుంది. కళ్లు హైడ్రేట్ అవుతాయి. మంట, ఎరుపుదనం, దురద, పొడిబారడం తగ్గుతుంది.
స్క్రీనింగ్ తగ్గించండి:
కళ్లు పొడిబారి, దురద సమస్యతో బాధ పడేవారు స్క్రీనింగ్ టైమ్‌ని తగ్గించుకోవాలి. టీవీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్ల అదే పలంగా చూడకూదు. ల్యాప్ ట్యాప్స్ మీద పని చేసేవారు మధ్యలో బ్రేక్ తీసుకోవాలి.
ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్:
కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే ఆహారాలను తినాలి. వీటిని తినడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. వాల్ నట్స్, బాదం, పల్లీలు, అవిసె గింజలు, చేపల్లో ఎక్కువగా లభిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..