Gas Home Remedies: గ్యాస్ మరీ ఎక్కువగా రిలీజ్ అవుతుందా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

గ్యాస్ సమస్యలతో చాలా మంది బాధ పడుతూ ఉంటారు. గ్యాస్ అనేది ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. గ్యాస్ సమస్యలను ఇంటి చిట్కాలతో కూడా తగ్గించుకోవచ్చు..

Gas Home Remedies: గ్యాస్ మరీ ఎక్కువగా రిలీజ్ అవుతుందా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Gas Problem 1
Follow us
Chinni Enni

|

Updated on: Dec 04, 2024 | 4:21 PM

గ్యాస్ సమస్యలను అసలు తేలికగా తీసుకోకూడదు. దీని వల్ల అనేక ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్యాస్ రిలీజ్ చేయడం అన్నది సాధారణ ప్రక్రియే. కానీ మరీ ఎక్కువగా గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటే మాత్రం ఆలోచించాల్సిన విషయం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెనుక నుంచి గ్యాస్ ఎక్కువగా రిలీజ్ అయితే.. పలు అనారోగ్య సమస్యలు రావచ్చు. బయట నలుగురిలో ఉన్నప్పుడు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. గ్యాస్ రిలీజ్ చేయకపోతే మాత్రం మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్ ఎక్కువగా రిలీజ్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అతిగా ఆహారం తీసుకున్నా, భోజనం సరైన సమయానికి తినకపోయినా, అజీర్తి, కడుపు ఉబ్బరం, కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ తాగడం, టీ, కాఫీలు అధికంగా తాగినా కూడా గ్యాస్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అంతే కాకుండా పప్పు దినుసులు, మసాలా దినుసులు, ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా తీసుకున్నా కూడా గ్యాస్ సమస్య తలెత్తుతుంది.

గ్యాస్ సమస్యను మొదట్లోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి. లేదంటే తీవ్రంగా పెరిగి ప్రాణానికి ప్రమాదంగా మారవచ్చు. అల్సర్లు వంటివి ఎటాక్ చేయవచ్చు. గ్యాస్ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. మొదట్లో గ్యాస్ సమస్యతో బాధ పడేవారు ఇంట్లో ఉండే వాటితోనే కంట్రోల్ చేసుకోవచ్చు.

అల్లం:

గ్యాస్ సమస్యలను తగ్గించడంలో అల్లం ఎంతో చక్కగా పని చేస్తుంది. గ్యాస్ సమస్య తలెత్తినప్పుడు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తింటే ఈ సమస్య కంట్రోల్ అవుతుంది. అల్లాన్ని మరిగించిన నీటిని తాగినా పర్వాలేదు. పొట్టలో అసౌకర్యం, అజీర్తి, ఉబ్బరం వంటివి తొలగుతాయి.

ఇవి కూడా చదవండి

యాపిల్ సైడర్ వెనిగర్:

ఈ మధ్య కాలంలో యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గ్యాస్‌గా అనిపించినా, కడుపులో అసౌకర్యంగా, ఉబ్బరంగా ఉన్నా.. ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్.. భోజనం ముందు తీసుకోవాలి. దీంతో గ్యాస్ సమస్య కంట్రోల్ అవుతుంది.

సోంపు:

గ్యాస్ తలెత్తినప్పుడు సోంపు తిన్నా కూడా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. జీర్ణ సమస్యలను దూరం చేసి, పొట్టలో ఉండే అసౌకర్యాన్ని సోంపు తగ్గిస్తుంది. కాబట్టి సోంపు తిన్నా, సోంపును మరిగించిన నీటిని తాగినా గ్యాస్ కంట్రోల్ అవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..