- Telugu News Photo Gallery Follow this simple trick if you don't want to lose hair in winter, Check Here is Details
Winter Hair Care: శీతా కాలంలో జుట్టు రాలకూడదనుకుంటే ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి!
ఎంతో మందిని బాధ పెట్టే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. కేవలం చలి కాలంలోనే కాకుండా హెయిర ఫాల్ సమస్యతో బాధ పడేవారు ఇప్పుడు చెప్పే ఈ సింపుల్ ట్రిక్ ఫాలో చేస్తే.. బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి..
Updated on: Dec 04, 2024 | 3:46 PM

శీతా కాలంలో కేవలం అనారోగ్య సమస్యలే కాకుండా.. అందానికి సంబంధించిన సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి. చర్మంతో పాటు జుట్టు కూడా ఇబ్బంది పెడుతుంది. ఈ వింటర్ సీజన్‌లో ఎక్కువగా హెయిర్ ఫాల్ సమస్య ఉంటుంది. చుండ్రు పట్టడం, జుట్టు చిట్లడం వంటివి జరుగుతాయి.

జుట్టు విపరీతంగా రాలుతూ ఉండటంతో.. ఇన్ డైరెక్ట్‌గా ఒత్తిడి, ఆందోళనలు కూడా పెరుగుపోతాయి. హెయిర్ ఫాల్ సమస్యలను ఆపడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పే ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేస్తే.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

చలి కాలంలో ఆహారం అనేది సరిగ్గా తీసుకోరు. దీని వల్ల జుట్టుకు కూడా సరిగా పోషకాలు అందక రాలిపోతూ ఉంటుంది. కానీ సరైన పోషకాలను అందిస్తే రాలడం తగ్గి పెరుగుతుంది. జుట్టు సమస్యలను దూరం చేయడంలో ట్రై ఫ్రూట్స్ ఎంతో చక్కగా సహాయ పడతాయి.

హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వారు ప్రతి రోజూ ఓ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. బాదం, జీడిపప్పు, గింజలు, విత్తనాలు, ఖర్జూరం వంటివి తీసుకోవడం వల్ల జుట్టుకు మంచి పోషకాలు అందుతాయి.

జుట్టు రాలడం, చిట్లడం తగ్గి.. వేగంగా జుట్టు పెరుగుతుంది. తినడం ఇష్టం లేనివారు మిల్క్ షేక్ కింద కూడా నట్స్ తీసుకోవచ్చు. ఉదయం తినడం వల్ల శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. కేవలం జుట్టు సమస్యలే కాకుండా చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి.





























