- Telugu News Photo Gallery Cinema photos May pushpa 3 lead will be in the climax of pushpa 2 know the details here
Pushpa 2: పుష్ప 2 క్లైమాక్స్‌లో స్పెషల్ సర్‌ప్రైజ్
దేశవ్యాప్తంగా పుష్పరాజ్ మేనియా పీక్స్‌కు చేరింది. ఆల్రెడీ సెన్సార్ టాక్ కూడా బయటకు వచ్చేయటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ జోష్‌ను డబుల్ చేసే న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఏంటా న్యూస్ అనుకుంటున్నారా...? అయితే వాచ్ దిస్ స్టోరి. కొద్ది రోజుల క్రితం పుష్ప 3కి సంబంధించిన డిస్కషన్ గట్టిగా జరిగింది.
Updated on: Dec 04, 2024 | 3:42 PM

దేశవ్యాప్తంగా పుష్పరాజ్ మేనియా పీక్స్‌కు చేరింది. ఆల్రెడీ సెన్సార్ టాక్ కూడా బయటకు వచ్చేయటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ జోష్‌ను డబుల్ చేసే న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఏంటా న్యూస్ అనుకుంటున్నారా...? అయితే వాచ్ దిస్ స్టోరి.

కొద్ది రోజుల క్రితం పుష్ప 3కి సంబంధించిన డిస్కషన్ గట్టిగా జరిగింది. త్రీక్వెల్ కచ్చితంగా ఉంటుందన్న న్యూస్ తెగ వైరల్ అయ్యింది. చిత్రయూనిట్ నుంచి కూడా త్రీక్వెల్‌కు సంబంధించిన ఆలోచనలు జరుగుతున్నాయన్న హింట్స్ వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.

పుష్ప 2 ప్రమోషన్స్‌తో అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లేశారు అల్లు అర్జున్. పుష్ప 3 ఉంటుందా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు అమ్మో మళ్లీనా నా వల్ల కాదనేశారు బన్నీ. ఈ కామెంట్ తరువాత పుష్ప 3 ఉండదన్న కంక్లూజన్‌కు వచ్చేశారు ఆడియన్స్.

కానీ సెన్సార్ అప్‌డేట్‌తో మరోసారి పుష్ప 3కి సంబంధించిన డిస్కషన్ మొదలైంది. సినిమా క్లైమాక్స్‌లో పార్ట్ 3కి సంబంధించిన లీడ్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఆ లీడ్ ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఎగ్జైట్ చేస్తుందన్నది ఇన్‌సైడ్ టాక్.

పుష్ప 3కి సంబంధించిన న్యూస్ మళ్లీ ట్రెండ్ అవుతుండటంతో అల్లు ఆర్మీలో జోష్ కనిపిస్తోంది. ఆల్రెడీ పుష్ప2 మీద హైప్ నేషనల్ లెవల్‌లో పీక్స్‌లో ఉంది. ఇప్పుడు ఆ హీట్‌కు పుష్ప 3 అప్‌డేట్ కూడా యాడ్ అవ్వటంతో వైల్డ్ ఫైర్‌లా స్ప్రెడ్ అవుతోంది పుష్పరాజ్ మేనియా.




