- Telugu News Photo Gallery Cinema photos Check Allu Arjun movie career remuneration starting from Rs. 100 to Rs. 300 crores with Pushpa 2
Pushpa 2: ఇది సార్ ఐకాన్ స్టార్ రేంజ్..! రూ.100 రెమ్యునరేషన్ నుంచి ఇప్పుడు ఏకంగా రూ.300కోట్లు
పుష్ప2 ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబయిలో జరిగిన సినిమా ఈవెంట్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు పుష్ప 2 విడుదలకు మరికొన్ని గంటలు సమయం మాత్రమే ఉంది.
Updated on: Dec 04, 2024 | 1:13 PM

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన డాడీ సినిమాలో చిన్న రోల్ లో కనిపించాడు.

అంతకన్నా ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించాడు. చిరంజీవి హీరోగా నటించిన విజేత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు బన్నీ. అలాగే కమల్ హాసన్ క్లాసిక్ హిట్ స్వాతి ముత్యం సినిమాలోనూ నటించాడు అల్లు అర్జున్.

రాఘవేంద్ర రావు దర్శకత్వలో తెరకెక్కిన గంగోత్రి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. డాడీ సినిమాలో అల్లు అర్జున్ చేసిన డాన్స్ చూసి ఫిదా అయిన రాఘవేంద్రరావు. అల్లు అర్జున్ కు వందరూపాయిలు ఇచ్చారట. అదే ఆయన మొదటి రెమ్యునరేషన్.

రాఘవేంద్ర రావు చేతుల మీదుగా అందుకున్న వందరూపాయిలను ఇప్పటికి పదిలంగా దాచుకున్నారట బన్నీ. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా వందకోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా మరికొన్ని గంటల్లో విడుదలకానుంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ఏకంగా పుష్ప కోసం రూ. 300కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇక పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.




