చాలామందికి ఖరీదైన పండ్లలోనే పోషకాలు ఎక్కువ ఉంటాయన్న అపోహ ఉంటుంది. కానీ తక్కువ ధరకు లభించే జామ వంటి సీజనల్ పండ్లలో కూడా పోషకాలు దండిగా ఉంటాయి
TV9 Telugu
జామ తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు అందించే పండ్లు. ఏ సీజన్‌లోనైనా జామ పండు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి
TV9 Telugu
ప్రతి సీజన్‌లో మార్కెట్లో చాలా కూరగాయలు, పండ్లు దర్శనమిస్తాయి. కానీ ఆయా పండ్లు, కూరగాయలను దాని సీజన్‌లో తినడం ఉత్తమమని చాలా మంది భావిస్తారు. అదేవిధంగా జామ కూడా ప్రతి సీజన్‌లో లభిస్తుంది
TV9 Telugu
జామపండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. దీని ఆకులు కూడా ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయి
TV9 Telugu
జామ పండ్లు శీతాకాలంలో ఎక్కువగా లభిస్తాయి. అంతేకాకుండా వర్షాకాలం కూడా జామ అధికంగా దిగుబడిని ఇస్తుంది. ఈ పండ్లు సాధారణంగా పండినవి రుచికి తీపిగా ఉంటాయి
TV9 Telugu
ముఖ్యంగా శీతాకాలంలో జామ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అయితే దీని శీతలీకరణ ప్రభావం కారణంగా రాత్రిపూట వీటిని తినకూడదు
TV9 Telugu
రాత్రి నిద్రకు ముందు జామ తినడం మంచిదికాదు. ఎందుకంటే ఇది అధిక శక్తిని అందిస్తుంది. ఫలితంగా నిద్రకు భంగం కలిగిస్తుంది. జలుబు, దగ్గు కూడా వస్తుంది. అందుకే శీతాకాలంలో దీనిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
TV9 Telugu
వర్షాకాలంలో కూడా తాజా జామపండ్లు లభిస్తాయి. కానీ ఈ సమయంలో జామపండ్లను జాగ్రత్తగా తినాలి. ఎందుకుంటే వీటిల్లో పురుగులు ఉండవచ్చు. కాబట్టి వాటిని నేరుగా తినడానికి బదులుగా కోసి తినడం మంచిది