Chinni Enni |
Updated on: Dec 04, 2024 | 6:57 PM
బ్రేక్ ఫాస్ట్‌కి ఎక్కువగా ఇడ్లీ, దోశ పిండ్లను రుబ్బి పెట్టుకుంటూ ఉంటాం. ఇంట్లో శుభ్రంగా పిండి తయారు చేసుకోవచ్చు. అయితే ఒక్కోసారి ఇడ్లీ లేదా దోశ పిండి పులుసు పోతూ ఉంటాయి. దీని వల్ల పిండి పారేస్తూ ఉంటారు. కానీ పారేయడానికి మనసు ఒప్పుదు.
పుల్లగా మారిన పిండిని మళ్లీ ఫ్రెష్‌గా మార్చుకోవచ్చు. దీని వల్ల పిండి కూడా వృథా కాకుండా ఉంటుంది. ఏ పిండి పులిసి పోయినా పంచదార లేదా బెల్లం కలిపితే.. పులుపు అనేది తగ్గుతుంది. అంతే కాకుండా పిండికి కూడా రుచి పెరుగుతుంది. అయితే కొద్దిగా మాత్రమే కలుపుకోవాలి.
ఇడ్లీ పిండిలో.. బియ్యాన్ని నానబెట్టి.. మళ్లీ రుబ్బి పిండి కలపడం వల్ల ఫ్రెష్‌గా మారుతుంది. అయితే కొద్దిగా టేస్ట్ మారుతుంది. అలాంటి సమయంలో టమాటా చట్నీతో తినవచ్చు. లేదంటే ఓట్స్ అయినా నానబెట్టి దోశ లేదా ఇడ్లీ పిండిలో కలుపుకోవచ్చు.
అటుకులు అయినా నానబెట్టి దోశ లేదా ఇడ్లీ పిండిలో కలుపుకుని వేసుకుంటే పులుపు తగ్గడమే కాకుండా రుచిగా ఉంటాయి. ఇడ్లీలు, దోశలు మెత్తగా వస్తాయి. దోశ పిండిలో అయితే రవ్వ కలుపుకోవచ్చు. దీని వల్ల పులుపు తగ్గడమే కాకుండా.. దోశలు క్రిస్పీగా వస్తాయి.
ఇడ్లీ లేదా దోశ పిండి బాగా పులిసి పోయినప్పుడు మాత్రం క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు కలిపి అట్లు వేసుకోవచ్చు. ఇవి కూడా రుచిగానే ఉంటాయి.