- Telugu News Photo Gallery Cricket photos Team India Player Yashasvi Jaiswal ICC Ranking Dropped From 2nd to 4th in a Week
ICC Test Rankings: టీమిండియా సెంచరీ ప్లేయర్‌కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. ఎందుకంటే?
ICC Test Rankings: పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెంచరీతో టెస్ట్ బ్యాట్స్‌మెన్స్ ర్యాంకింగ్స్‌లో 2వ స్థానానికి ఎగబాకిన యశస్వి జైస్వాల్ కేవలం ఒక వారంలోనే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానానికి పడిపోయాడు. హ్యారీ బ్రూక్ మంచి ఆటతీరుతో జైస్వాల్ తన స్థానాన్ని కోల్పోయాడు. అయితే, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మాత్రం తన విజయాన్ని కొనసాగిస్తున్న జస్ప్రీత్ బుమ్రా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
Updated on: Dec 05, 2024 | 6:47 PM

ICC Test Rankings: పెర్త్ మైదానంలో ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ సెంచరీ సాధించి, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ ప్రమోషన్‌ను అందుకున్న భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. గత వారమే బ్యాట్స్‌మెన్స్ ర్యాంకింగ్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. కాగా, జైస్వాల్ వారం రోజుల్లోనే ఆ స్థానాన్ని కోల్పోవడం విశేషం.

పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగుల ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన జైస్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 2 స్థానాలు ఎగబాకి 2వ ర్యాంక్‌ను ఆక్రమించాడు. అయితే, ఆ తర్వాత తిరిగి తన పాత స్థానానికి అంటే 4వ స్థానానికి పడిపోయాడు.

నిజానికి డిసెంబర్ 1న న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య ముగిసిన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ 171 పరుగులు చేశాడు. తద్వారా దీన్ని సద్వినియోగం చేసుకున్న బ్రూక్ మరోసారి 2వ స్థానానికి చేరుకోవడంలో సఫలమయ్యాడు.

వారం రోజుల క్రితం బ్రూక్ సీటును జైస్వాల్ చేజిక్కించుకోగా, ఇప్పుడు జైస్వాల్ సీటును బ్రూక్ కైవసం చేసుకున్నాడు. కేన్ విలియమ్సన్ కూడా జైస్వాల్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచాడు. కాకపోతే, క్రికెట్‌లో సుదీర్ఘ ఫార్మాట్‌లో జో రూట్ ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా మిగిలిపోయాడు.

అలాగే, డారిల్ మిచెల్ 753 రేటింగ్‌తో మునుపటిలా 5వ స్థానంలో ఉండగా, భారత ఆటగాడు రిషబ్ పంత్ 736 రేటింగ్‌తో 6వ స్థానంలో ఉన్నాడు. శ్రీలంక ఆటగాడు కమెందు మెండిస్ రెండు స్థానాలు ఎగబాకాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 726 రేటింగ్‌తో మరో స్థానం దిగజారి 8వ స్థానానికి చేరుకున్నాడు.

పాకిస్థాన్‌కు చెందిన సౌద్ షకీల్ ఇప్పుడు ఒక స్థానం దిగజారి 9వ స్థానానికి చేరుకున్నాడు. కాగా, దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ థెంబా బావుమా అద్భుత ప్రదర్శన చేసి ఈసారి రేటింగ్‌లో 14 స్థానాలు ఎగబాకాడు. అతను ఇప్పుడు 715 రేటింగ్‌తో 10వ స్థానాన్ని ఆక్రమించాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన జోరు కొనసాగిస్తున్నాడు. గత వారమే అగ్రస్థానానికి చేరుకున్న బుమ్రా.. ప్రపంచ నంబర్ వన్ టెస్టు బౌలర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు.




