- Telugu News Photo Gallery Cinema photos Salman khan wanted movie train sequence using sikandar movie
Salman Khan: సెంటిమెంట్‌ను నమ్ముకున్న సల్మాన్ ఖాన్
వరుస ఫెయిల్యూర్స్ తరువాత సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేందుకు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్. అందుకే ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సికందర్ సినిమాలో హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.
Updated on: Dec 04, 2024 | 8:30 PM

వరుస ఫెయిల్యూర్స్ తరువాత సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేందుకు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్. అందుకే ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సికందర్ సినిమాలో హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

టైగర్ 3 ఫెయిల్యూర్ తరువాత సికందర్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సల్మాన్. సౌత్ డైరెక్టర్ మురుగదాస్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ మూవీతో ఎలాగై హిట్ కొట్టాలని కష్టపడుతున్నారు. అందుకే అన్ని రకాల సెంటిమెంట్స్‌ను ట్రై చేస్తున్నారు భాయ్‌జాన్.

ప్రజెంట్ నార్త్ మార్కెట్‌ను సౌత్ ఫ్లేవరే రూల్ చేస్తోంది. అందుకే సికందర్ సినిమాకు దర్శకుడితో పాటు హీరోయిన్‌గా కూడా సౌత్ బ్యూటీనే సెలెక్ట్ చేసుకున్నారు. ప్రజెంట్ సూపర్ ఫామ్‌లో రష్మిక మందన్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా నటిస్తున్నారు.

గతంలో సల్మాన్‌కు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ట్రైన్ సీక్వెన్స్‌ను కూడా ఈ సినిమాలో రిపీట్ చేయబోతున్నారు. పోకిరికి రీమేక్‌గా తెరకెక్కిన వాంటెడ్ మూవీలో టెరిఫిక్ ట్రైన్ సీక్వెన్స్ ఉంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ వాంటెడ్ సక్సెస్‌లో కీ రోల్ చేసింది.

ఆ తరువాత ఏక్తా టైగర్ సినిమాలో ఓ ఇంటెన్స్ ట్రైన్ యాక్షన్ సీన్ ట్రై చేశారు సల్లూ భాయ్. రీసెంట్‌గా పఠాన్ సినిమాలోనూ సల్మాన్ గెస్ట్ రోల్‌లో కనిపించింది ట్రైన్ సీక్వెన్స్‌లోనే. అందుకే నెక్ట్స్ మూవీలో కూడా ఓ భారీ యాక్షన్ సీన్‌ను ట్రైన్‌లో ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ భాయ్‌జాన్‌కు హిట్ ఇస్తుందేమో చూడాలి.