- Telugu News Photo Gallery Cinema photos Do You This Actress Worked as a News Reader Before Enter In Industry, She Is Priya Bhavani Shankar
Tollywood: అందానికి కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు.. న్యూస్ రీడర్ నుంచి ఇప్పుడు క్రేజీ హీరోయిన్గా..
దక్షిణాది సినీరంగంలో తనదైన నటనతో మెప్పించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించి వరుస ఆఫర్స్ అందుకుంది. ఓ ప్రముఖ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేసింది. అలాగే యాంకరింగ్ కూడా చేసింది. తను ఎవరంటే..
Updated on: Dec 04, 2024 | 9:12 PM

బుల్లితెరపై న్యూస్ రీడర్.. ఆ తర్వాత యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించింది. నటిగా కెరీర్ మొదలుపెట్టకముందే బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తనే ప్రియా భవానీ శంకర్.

1989లో తమిళనాడులో జన్మించిన ఈ బ్యూటీ.. మొదట్లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేసింది. పుతియ తలైమురైలో న్యూస్ చదివేది. బుల్లితెరపై పలు సీరియల్లలో నటించింది.

కళ్యాణ్ ముదల్ కాదల్ వరై సీరియల్లో మెయిన్ రోల్ పోషించింది. ఆ తర్వాత వైభవ్ రెడ్డి హీరోగా వచ్చిన మేయదా మాన్ అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన కడై కుట్టి సింగం (చినబాబు) సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఎస్ జే సూర్య జోడిగా మాన్ స్టర్ చిత్రంలో మెప్పించింది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది.

సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ కంటెంట్ తరహా చిత్రాల్లో నటిస్తుంది.




