AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంజీర్‌తో అద్భుతాలు.. రోజూ రెండు తింటే ఏమవుతుందో తెలుసా..?

Anjeer Benefits: చలికాలంలో అంజీర్ పండ్లు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. ఆయుర్వేదం, ఆధునిక వైద్యం రెండూ గుర్తించిన ఈ సూపర్ ఫుడ్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకల బలం, మలబద్ధక నివారణ, గుండె ఆరోగ్యం, మధుమేహ నియంత్రణ, రక్తహీనత దూరం, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

అంజీర్‌తో అద్భుతాలు.. రోజూ రెండు తింటే ఏమవుతుందో తెలుసా..?
Anjeer Health Benefits
Krishna S
|

Updated on: Dec 22, 2025 | 9:12 PM

Share

చలికాలం వచ్చిందంటే చాలు.. బాడీలో ఇమ్యూనిటీ తగ్గి రకరకాల ఇన్ఫెక్షన్లు చుట్టుముడుతుంటాయి. ఈ సమయంలో ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం అంజీర్. ఆయుర్వేదం, ఆధునిక వైద్యం రెండూ సూపర్‌ఫుడ్‌‌గా గుర్తించిన అంజీర్ పండ్లు.. చలికాలంలో ఔషధంగా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ రెండు అంజూర పండ్లు తీసుకోవడం వల్ల కలిగే 8 అద్భుత ప్రయోజనాలు ఇవే..

ఇనుములాంటి ఎముకలు

అంజీర్ పండ్లు కాల్షియానికి కేరాఫ్ అడ్రస్. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధుల నుండి ఇది రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో వేధించే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే అంజీర్ తప్పనిసరి.

మలబద్ధకానికి చెక్

చలికాలంలో నీరు తక్కువగా తాగడం వల్ల చాలామంది మలబద్ధకంతో బాధపడుతుంటారు. అంజీర్‌లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ సహజ విరేచనకారిలా పనిచేసి, పేగులను శుభ్రపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

గుండె పదిలం

రక్తంలోని చెడు కొవ్వు (ట్రైగ్లిజరైడ్స్) స్థాయిలను తగ్గించడంలో అంజీర్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తూ, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మధుమేహ నియంత్రణ

అంజీర్ తియ్యగా ఉన్నప్పటికీ దీనిలో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఇది టైప్-2 డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తుంది.

రక్తహీనత దూరం

శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండి, త్వరగా అలసిపోయేవారికి అంజీర్ ఒక వరం. దీనిలోని ఐరన్ కంటెంట్ రక్తాన్ని వృద్ధి చేసి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

ఇమ్యూనిటీ బూస్టర్

విటమిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే అంజీర్ పండ్లు.. జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడతాయి. చర్మం పొడిబారకుండా కాంతివంతంగా ఉండేలా చేస్తాయి.

బరువు తగ్గాలనుకునే వారికి..

శీతాకాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే అంజీర్‌ను స్నాక్‌గా తీసుకోవచ్చు. ఇది తిన్న తర్వాత ఆకలి త్వరగా వేయదు, దీనివల్ల జీవక్రియ వేగవంతమవుతుంది.

నిపుణుల సూచన ప్రకారం.. రెండు అంజీర్ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఆ పండ్లను తిని, ఆ నీటిని కూడా తాగాలి. ఇలా చేయడం వల్ల పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..