AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జామపండ్లు కొనేముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి.. లేకపోతే ఏం జరుగుతుందంటే..?

Guava: మార్కెట్లో జామపండ్లు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ ఇంటికి తెచ్చి కోశాక చూస్తే లోపల పురుగులు లేదా కుళ్లిపోయి ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. మరి మంచి రుచికరమైన, నాణ్యమైన జామపండ్లను ఎలా గుర్తుపట్టాలో తెలుసా..? కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే మంచి జామకాయలను ఇట్టే గుర్తుపట్టొచ్చు.

Krishna S
|

Updated on: Dec 22, 2025 | 5:59 PM

Share
రంగును బట్టి: మీరు జామకాయలను కొనేటప్పుడు రంగుపై దృష్టి పెట్టండి. మరీ ముదురు ఆకుపచ్చగా ఉంటే అవి అస్సలు పండలేదు అని అర్థం. అలా అని మరీ పసుపు రంగులో ఉంటే ఎక్కువగా పండిపోయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి లేత ఆకుపచ్చ, లేత పసుపు మధ్య ఉండే రంగును ఎంచుకోవడం ఉత్తమం.

1 / 6
జామపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని అధికంగా తింటే విరేచనాలు, కడుపు నొప్పిని పెంచుతుంది. ముఖ్యంగా చల్లగా ఉండే వాతావరణంలో జామపండు తినడం వల్ల గొంతులో అసౌకర్యం పెరుగుతుంది. అలాగే జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు జామపండును ఎక్కువగా తినకూడదు.

2 / 6
బరువు: పండు పరిమాణానికి తగ్గ బరువు ఉండాలి. జామపండు చేతికి కాస్త బరువుగా అనిపిస్తేనే అది నాణ్యమైనదని అర్థం. ఒకవేళ అది ఎండిపోయి లేదా తేలికగా ఉంటే, దానిలో రసం తక్కువగా ఉండి రుచి ఉండదు.

3 / 6
 పండును చేతితో మెల్లగా నొక్కి చూడండి. మరీ రాయిలా గట్టిగా ఉంటే అది పండలేదని, మరీ మెత్తగా ఉంటే అది కుళ్లిపోయే స్థితిలో ఉందని గుర్తించాలి. పండు కాస్త స్థిరంగా ఉంటూనే వేలితో నొక్కినప్పుడు కొంచెం వంగితే అది సరైన స్థితిలో ఉన్నట్లు లెక్క.

4 / 6
జామకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జామకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది నిర్జలీకరణాన్ని నివారిస్తుంది. ఎన్ని లాభాల ఉన్ననప్పటికీ కొంతమందికి శీతాకాలంలో జామ పండ్లు మేలు కంటే హాని ఎక్కువ తలపెడతాయి. అలాంటి వారు వీటికి దూరంగా ఉండటం మంచిది.

5 / 6
జామపండు కోసిన తర్వాత లోపలి భాగం తెల్లగా లేదా లేత గులాబీ రంగులో ఉంటే అది తియ్యగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. వచ్చేసారి జామపండ్లు కొనేటప్పుడు ఈ రంగు, వాసన, బరువు, మృదుత్వం అనే 5 సూత్రాలను గుర్తుంచుకుంటే మంచి కాయలను ఇంటికి తీసుకెళ్లవచ్చు.

6 / 6