AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం పాటరా బాబు.. సోషల్ మీడియాను ఊపేస్తోంది.. ఇప్పటికే యూట్యూబ్ లో 100 కోట్లకు పైగా వ్యూస్.. మీరూ చూశారా?

ఇటీవల కొన్ని సినిమా సాంగ్స్ సోషల్ మీడియానుషేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో రికార్డులను ఇట్టే తుడిచేస్తున్నాయి. అలా గతేడాది రిలీజైన ఓ సినిమాలోని స్పెషల్ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటోంది. ఇప్పటికే ఈ పాటకు ఏకంగా 100 కోట్లకు వ్యూస్ వచ్చాయి.

ఏం పాటరా బాబు.. సోషల్ మీడియాను ఊపేస్తోంది.. ఇప్పటికే యూట్యూబ్ లో 100 కోట్లకు పైగా వ్యూస్.. మీరూ చూశారా?
Tamannaah Bhatia Special Song Aaj Ki Raat
Basha Shek
|

Updated on: Jan 17, 2026 | 12:04 PM

Share

ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. మొదట బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు శీను మూవీలో ‘రావే నా లబ్బర్‌ బొమ్మ’ అనే స్పెషల్ సాంగ్ లో తొలిసారి స్టెప్పులేసిందీ అందాల తార. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశలో ‘స్వింగ్‌ జర’ పాటతో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరులో ‘డాంగ్‌ డాంగ్‌’, పాట కానీ, రజనీకాంత్ జైలర్‌లో ‘నువ్వు కావాలయ్యా..’, స్త్రీ 2లో ‘ఆజ్‌ కీ రాత్‌’, రైడ్‌ 2లో ‘నషా’ తదితర పాటల్లో తమన్నా స్టెప్పులకు జనం ఫిదా అయిపోయారు. అలా తమన్నా నటించిన ఓ స్పెషల్ సాంగ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటోంది. తాజాగా ఈ సాంగ్ కు యూట్యూబ్ లో 100 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో మిల్కీ బ్యూటీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. ఇంతకీ ఆ పాట ఏంటనుకుంటున్నారా?

సుమారు రెండేళ్ల క్రితం వచ్చిన హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ  ‘స్త్రీ 2’. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు మరో కీలక పాత్రలో మెరిశాడు. 2024లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కాగా స్త్రీ 2 సినిమా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్. ‘ఆజ్ కీ రాత్’ అంటూ ఆమె వేసిన ఆమె వేసిన డ్యాన్స్ స్టెప్పులకు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో మోత మోగించిన ఈ పాట.. ఇప్పుడు యూట్యూబ్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఈ వీడియో సాంగ్ బిలియన్ (100 కోట్లు) వ్యూస్ మార్కును క్రాస్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి మురిసిపోయింది తమన్నా. ఇన్‌స్టాగ్రామ్‌లో పాట షూటింగ్ సమయానికి సంబంధించిన బిహైండ్ ది సీన్స్ క్లిప్స్‌ను షేర్ చేసి .. ‘మొదటి వ్యూ నుంచి 1 బిలియన్ వ్యూస్ వరకు.. ఇంత ప్రేమను కురిపించినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని క్యాప్షన్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

‘ఆజ్ కీ రాత్’  సాంగ్ షూట్ లో తమన్నా..

‘ఆజ్ కీ రాత్’ పాటకు సచిన్-జిగర్ సంగీతం అందించారు. మధుబంతి బాగ్చి, దివ్య కుమార్ పాడారు. అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు.

ఆజ్ కీ రాత్ వీడియో సాంగ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..