AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం దొరికితే శుభమా.. అశుభమా..? పోగొట్టుకోవడం దేనికి సంకేతమో తెలుసా..?

భారత సంప్రదాయంలో బంగారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. బంగారాన్ని సంపదకు, అదృష్టానికి, గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. పండగలు, శుభకార్యాల సమయంలో బంగారాన్ని స్త్రీ, పురుషులు ఎక్కువగా ధరిస్తుంటారు. మన దగ్గర ఉన్న బంగారం పోవడం లేదా మనకు వేరే వారి బంగారం దొరకడం శుభమా? అశుభమా? అనేది జ్యోతిష్యశాస్త్రం తెలియజేస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం.

బంగారం దొరికితే శుభమా.. అశుభమా..? పోగొట్టుకోవడం దేనికి సంకేతమో తెలుసా..?
Gold
Rajashekher G
|

Updated on: Jan 17, 2026 | 12:37 PM

Share

భారత సంప్రదాయంలో బంగారం కేవలం విలువైన లోహం మాత్రమే కాదు… అది సంపద, గౌరవం, అదృష్టం, లక్ష్మీ కటాక్షానికి ప్రతీకగా భావిస్తారు. అలాంటి బంగారం పోగొట్టుకోవడం లేదా రోడ్డు మీద దొరకడం వెనుక కొన్ని గ్రహాల ప్రతికూల, అనుకూల ప్రభావాలు ఉంటాయని జ్యోతిష్యం చెబుతోంది. ఒక వ్యక్తి బంగారం కోల్పోవడం అనేది అతని జాతకంలో కేతువు, శని, రాహువు అనే మూడు గ్రహాల చెడు ప్రభావం వల్ల జరుగుతుందని జ్యోతిష్యం చెబుతోంది. ఈమూడు గ్రహాలు కొన్నిసార్లు కష్టాలను, ఆర్థిక నష్టాలను, ఆరోగ్య సమస్యలను తెస్తాయని నమ్ముతారు. బంగారం పోగొట్టుకోవడం అంటే ఆ వ్యక్తి దురదృష్టంలో పడినట్లే భావిస్తారు. ఇది కేవలం బంగారం మాత్రమే కాదు.. ఇతర విలువైన వస్తువులను కోల్పోవడానికి సంకేతం కావచ్చు. దీంతో ఆర్థిక ఇబ్బందులు, వ్యాధులు, విపత్తులు కూడా ఎదురుకావచ్చు.

బంగారం పోగొట్టుకోవడం అంటే ఏ గ్రహాల ప్రభావం?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి బంగారం కోల్పోవడం వెనుక ముఖ్యంగా కేతువు, శని, రాహువు అనే మూడు గ్రహాల ప్రతికూల ప్రభావం ఉంటుందని నమ్మకం. ఈ మూడు గ్రహాలు చెడు స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక నష్టాలు, అనుకోని ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, జీవితంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే బంగారం పోగొట్టుకోవడం అంటే ఆ వ్యక్తి దురదృష్ట కాలంలోకి ప్రవేశించినట్లు జ్యోతిష్కులు భావిస్తారు. ఇది కేవలం బంగారం మాత్రమే కాకుండా ఇతర విలువైన వస్తువులను కోల్పోయే సూచనగా కూడా చెబుతారు.

దారిలో బంగారం దొరికితే అదృష్టమా? దురదృష్టమా?

చాలా మంది బంగారం దొరికితే అదృష్టం అనుకుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం మాత్రం దీనిని భిన్నంగా వివరిస్తుంది. ప్రయాణ సమయంలో లేదా రోడ్డు మీద బంగారం కనిపించడం శుభం కాదని జ్యోతిష్యం చెబుతుంది. ఇది ముఖ్యంగా సూర్యుడు, బృహస్పతి (గురు) గ్రహాల చెడు స్థితిని సూచిస్తుంది. సూర్యుడు గ్రహాలకు రాజైనప్పటికీ.. బృహస్పతితో కలిసి ప్రతికూలంగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో సమస్యలు తలెత్తుతాయని నమ్మకం.

రోడ్డు మీద బంగారం దొరికితే వచ్చే ప్రభావాలు

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం రోడ్డు మీద బంగారం దొరికితే కీర్తి తగ్గడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, సమాజంలో హోదా పడిపోవడం, ఆరోగ్య సమస్యలు, అనిశ్చిత పరిస్థితులు వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే దొరికిన బంగారం వ్యక్తికి మేలు చేయకపోవచ్చని జ్యోతిష్యం చెబుతోంది.

దొరికిన బంగారాన్ని ఏమి చేయాలి?

రోడ్డు మీద బంగారం కనిపిస్తే దాన్ని సొంతం చేసుకోవడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. దానికి పరిష్కారంగా.. గురువారం రోజు ఆ బంగారాన్ని బ్రాహ్మణులకు దానం చేయడం ఉత్తమమని చెబుతారు. ఇలా చేయడం వల్ల కేతువు, శని, రాహువు గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని విశ్వాసం. దీంతో దురదృష్టం తగ్గి మనశ్శాంతి కలుగుతుందని అంటారు.

బంగారం – భారతీయ సంప్రదాయం

భారతీయ సంప్రదాయంలో బంగారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. శుభకార్యాల్లో తప్పనిసరి. సంపద, శ్రేయస్సుకు చిహ్నం. అందుకే వివాహాలు, పుట్టినరోజులు, పండుగలు వంటి శుభసందర్భాల్లో బంగారం ధరించడం ఆనవాయితీ. ఇది వ్యక్తి ఆర్థిక స్థితిని, గౌరవాన్ని కూడా సూచిస్తుంది.

జాతకంలో గ్రహాల అమరికే అసలు కారణం

బంగారం పోగొట్టుకోవడం లేదా దొరకడం అనేది వ్యక్తి జాతకంలో ఉన్న గ్రహాల అమరికపై ఆధారపడి ఉంటుంది. కేతువు, రాహువు, శని చెడు స్థానంలో ఉంటే నష్టాలు.. సూర్యుడు, బృహస్పతి బలహీనంగా ఉంటే కీర్తి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయని జ్యోతిష్యం చెబుతుంది.  బంగారం మన జీవితంలో సంపద, గౌరవానికి ప్రతీక. కానీ దాన్ని పోగొట్టుకోవడం లేదా దొరికిన సందర్భాల్లో జాగ్రత్తగా వ్యవహరించకపోతే సమస్యలు తప్పవు. జ్యోతిష్య సూచనల ప్రకారం సరైన నిర్ణయాలు తీసుకుంటే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9 తెలుగు ధృవీకరించదు.)