దానిమ్మ వీరికి విషంతో సమానం.. అస్సలు తిన‌కూడ‌దు!

17 January 2026

TV9 Telugu

TV9 Telugu

దానిమ్మ పండ్లు రుచికి తియ్య‌గా ఉండటమే కాదు పోషకాలు కూడా కమ్మగా ఉంటాయి. ఈ పండ్ల‌ల్లో అనేక ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్స్, ఖ‌నిజ ల‌వ‌ణాలు ఉంటాయి

TV9 Telugu

వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దానిమ్మ‌పండ్ల‌ను తిన‌డం లేదా వాటి జ్యూస్‌ తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య తొలగిపోతుంది

TV9 Telugu

దానిమ్మ ఆరోగ్యానిక మేలు చేస్తున్నప్పటికీ కొందరు వీటిని అస్సలు తీసుకోకూడ‌దు. ఎలాంటి సమస్యలు ఉన్న వారు వీటిని తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం

TV9 Telugu

దానిమ్మ‌పండ్లు తింటే కొంద‌రిలో జీర్ణ స‌మ‌స్య‌లు, అల‌ర్జీలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడే వారు కూడా దానిమ్మ‌పండ్ల‌ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి

TV9 Telugu

గ‌ర్భిణీలు కూడా వారు వాడే మందుల‌ను బ‌ట్టి వీటిని తీసుకోవ‌డం మంచిది. ఈ పండ్ల‌ల్లో పొటాషియం వ‌ల్ల ర‌క్త‌నాళాలు స‌డ‌లించ‌బ‌డి ర‌క్త‌పోటు త‌గ్గుతుంది. అందుకే లో బీపీతో బాధ‌ప‌డే వారు వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు మ‌రింత త‌గ్గుతుంది

TV9 Telugu

రోజుకు 300 ఎంఎల్ దానిమ్మ ర‌సం తాగ‌డం వ‌ల్ల రెండు నెల‌ల్లో సిస్టోలిక్ ర‌క్త‌పోటు దాదాపు 5ఎంఎం హెచ్‌జి, డ‌యాస్టోలిక్ ర‌క్త‌పోటు 3ఎంఎం హెచ్‌జి త‌గ్గుతుందని పరిశోధనలు వెల్లడించాయి

TV9 Telugu

అలాగే దానిమ్మ ర‌సం సీవైపీ3ఏ4, సీవైపీ2సీ9 వంటి ముఖ్య‌మైన కాలేయ ఎంజైమ్ ల‌ను నిరోధించ‌గ‌ల‌వు. ఈ ఎంజైమ్ లు ఔష‌ధాల‌ను జీవ‌క్రియ చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి

TV9 Telugu

దీంతో శ‌రీరంలో ఔష‌ధ స్థాయిలు పెరుగుతాయి. గుండె రోగుల‌కు లేదా దీర్ఘ‌కాలిక మందులు తీసుకునే వారికి ఇది ప్ర‌మాద‌క‌రంగా మారుతుంది. శ‌స్త్ర చికిత్స‌కు ముందు కూడా వీటిని తినకూడదు. రెండు వారాల ముందు నుంచి వీటిని తీసుకోకూడదు