సినిమాలో ఆ హీరోయినే ప్రాబ్లెమ్.. నేను చేయను అని చెప్పేశా.. షాకింగ్ విషయం చెప్పిన జయసుధ
సినీ నటి జయసుధ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటి ఆవిడ. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చరగాని ముద్ర వేశారు జయసుధ. సహజనటిగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు జయసుధ.

తన సహజమైన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి జయసుధ. తెలుగు సినిమాల్లో అమ్మ పాత్ర అంటే టక్కున గుర్తుకువచ్చే పేరు ఆమెది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఎంతో మంది స్టార్ హీరోలకు అమ్మగా నటించి ఆకట్టుకున్నారు. ఎలాంటి హావభావాలనైనా అలవోకగా పలికించగల నటి ఆమె.. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు జయసుధ. సినిమాలతో పాటు జయసుధ పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ.. కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. జయసుధ సినీ కెరీర్ లో మైలురాళ్లుగా నిలిచిన ప్రేమాభిషేకం, త్రిశూలం, అడవి రాముడు వంటి చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను తెలిపారు జయసుధ.
అతనంటే నాకు పిచ్చి.. నా గది నిండా ఆ హీరో ఫొటోలే : ఫోక్ డాన్సర్ నాగ దుర్గ
ప్రేమాభిషేకం చిత్రంలో ఒక వేశ్య పాత్రను పోషించడానికి ఆమె ముందుగా ఆలోచించాను, సినిమా చేయను అని చెప్పా అని తెలిపారు. శ్రీదేవి లాంటి హీరోయిన్ ఉన్న సినిమాలో నాకు చిన్న పాత్ర ఇవ్వడం గురించి ఆలోచించా.. ఆ సినిమాలో నా రోల్, టైం కాదు శ్రీదేవినే ప్రాబ్లెమ్.. దర్శకుడు దాసరి నారాయణరావు వంటి బలమైన వ్యక్తిత్వం ఉన్న మెంటర్ ప్రోత్సాహంతో, “శ్రీదేవి కాదు, ఎవరూ కనిపించరు, నీకే పేరు వస్తుంది” అనే ఆయన మాటలు నమ్మి జయసుధ ఆ పాత్రను చేశారట. దాసరి నారాయణరావు సూచన మేరకు, ఆ పాత్రకు ఎటువంటి మేకప్ లేకుండా, కేవలం పసుపు మాత్రమే ముఖానికి రాసుకుని నటించారట జయసుధ. ఆ సినిమాలో శ్రీదేవి గ్లామరస్ గా కనిపించినా, జయసుధ డీగ్లామరైజ్డ్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఆ ముద్దుగుమ్మకు పోటీ లేదు.. స్టార్ హీరోయిన్స్ కూడా ఆవిడనే ఫాలో అయ్యేవారన్న బాలయ్య
సినిమా విడుదలైన తర్వాత, తన డైలాగ్స్ అప్పట్లో వందరోజుల వేడుకల్లో సైతం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయని, ఆ పాత్ర ఆమె కెరీర్ లో ఎంతగానో నిలిచిపోయిందని జయసుధ గుర్తుచేసుకున్నారు. త్రిశూలం సినిమాలో శ్రీదేవి, రాధికా వంటి హీరోయిన్లతో కలిసి నటించే అవకాశం వచ్చిందని. ఈ చిత్రంలో ఆమెకు ఒక పాట, మూడు సీన్లు మాత్రమే ఉన్నప్పటికీ, దర్శకుడు రాఘవేంద్రరావు ఆమె ఎంట్రీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని. ఇంటర్వెల్ టైమ్ లో ఆమె పాత్ర ఎంట్రీని టైటిల్స్ తో కలిపి వేశారని గుర్తు చేసుకున్నారు జయసుధ.
అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




