కివి Vs నారింజ.. విటమిన్ సి దేనిలో ఎక్కువగా ఉంటుంది?
17 January 2026
TV9 Telugu
TV9 Telugu
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి పాత్ర సింహభాగం. చర్మ ఆరోగ్యానికి, శరీరం ఐరన్ ను గ్రహించడంలో విటమిన్ సి ముఖ్య పాత్ర పోషిస్తుంది
TV9 Telugu
నారింజ, కివి పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కావల్సిన విటమిన్ సి ను అందించడంలో ఇవి రెండు మంచి ఎంపికలు
TV9 Telugu
అయితే వీటిలో దేనిని తీసుకోవడం వల్ల మనకు విటమిన్ సి ఎక్కువగా అందుతుంది..? అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా?
TV9 Telugu
నిజానికి, నారింజ పండులో కంటే కివిలోనే విటమిన్ సి దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల నారింజ పండులో 53 మిల్లీ గ్రాముల విటమిన్ సి, కివి లలో 92 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది
TV9 Telugu
మీడియం సైజులో ఉండే కివి పండు ఒక రోజుకు శరీరానికి కావల్సిన విటమిన్ సి పూర్తిగా అందిస్తుంది. ఇవి రెండు పండ్లు కూడా తెల్ల రక్తకణాల పనితీరును పెంచడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి
TV9 Telugu
అయితే విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల కివి పండ్లను తీసుకుంటే శీతాకాలంలో రోగనిరోధక శక్తి శరీరానికి వేగంగా అందుతుంది. అదేవిధంగా చర్మ ఆరోగ్యం, కొల్లాజెన్ ఉత్పత్తిలో కూడా ఈ రెండు పండ్లు దోహదకరంగా ఉంటాయి
TV9 Telugu
జీర్ణక్రియ, పొట్ట ఆరోగ్యానికి ఇవి రెండు కూడా మద్దతును ఇస్తాయి. అయితే నారింజ పండ్లు సులభంగా తక్కువ ధరలో లభిస్తాయి
TV9 Telugu
రోజువారి విటమిన్ సి అవసరాలకు ఇవి అనుకూలమైనవి. కివి పండ్లు ఖరీదైనవి. అయితే వేగంగా విటమిన్ సి స్థాయిలను పెంచుకోవాలంటే కివి పండ్లు తినడం మంచిది