AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hack: కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలు ఎలా కట్ చేయాలో తెలుసా? సింపుల్‌ టిప్స్‌ ఇవిగో..

ఉల్లిపాయలు ఆహారానికి ప్రత్యేక రుచిని ఇస్తాయి. అందుకే ప్రతి వంటలోనూ ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. అయితే వీటిని కట్‌ చేయడం అంత సులువుకాదు. కళ్ళలో నీరు కారడం, చికాకు కారణంగా ఉల్లిపాయలను అసలు వంటల్లోనే వేయరు. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళలో నీరు కారడానికి కారణం వాటిలో..

Kitchen Hack: కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలు ఎలా కట్ చేయాలో తెలుసా? సింపుల్‌ టిప్స్‌ ఇవిగో..
How To Chop Onions Without Crying
Srilakshmi C
|

Updated on: Dec 22, 2025 | 8:54 PM

Share

ఉల్లిపాయలు ఆహారానికి ప్రత్యేక రుచిని ఇస్తాయి. అందుకే ప్రతి వంటలోనూ ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. అయితే వీటిని కట్‌ చేయడం అంత సులువుకాదు. కళ్ళలో నీరు కారడం, చికాకు కారణంగా ఉల్లిపాయలను అసలు వంటల్లోనే వేయరు. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళలో నీరు కారడానికి కారణం వాటిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు. ఉల్లిపాయలను కోసినప్పుడు వీటిల్లోని సల్ఫర్ సమ్మేళనాలు గాలిలోకి విడుదలై కళ్ళలోని తేమతో కలిసిపోయి మంట, కన్నీళ్లను కలిగిస్తాయి. అయితే ఈ కింది కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా మంట లేకుండా ఉల్లిపాయలను హాయిగా కట్ చేసుకోవచ్చు. ఏం చేయాలంటే..

ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండటానికి టిప్స్ ఇవిగో..

ఉల్లిపాయలను నీటిలో నానబెట్టాలి

ఉల్లిపాయలు కోసేటప్పుడు మీ కళ్ళు నీళ్లు కారకుండా ఉండటానికి వాటిని తొక్క తీసి కోసే ముందు అరగంట సేపు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల, ఉల్లిపాయలోని వాయువులు నీటితో బాగా కలిసిపోయి మీ కళ్ళు నీళ్లు కారకుండా ఉంటాయి.

ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచాలి

ఉల్లిపాయలను కట్ చేసే ముందు వీటిని 10 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ విధంగా ఉల్లిపాయలను చల్లబరచడం వల్ల సల్ఫర్ సమ్మేళనాల ప్రభావం తగ్గుతుంది. తద్వారా ఉల్లిపాయలను కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఫ్యాన్ కింద ఉల్లిపాయలను కట్‌ చేయడం

ఫ్యాన్ ఆన్ చేసి ఉల్లిపాయలను కోయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే గాలి ప్రవాహం సల్ఫర్ సమ్మేళనాలు కళ్ళలోకి చేరకుండా నిరోధిస్తుంది.

కత్తికి నిమ్మరసం

ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళ నుంచి నీరు కారకుండా ఉండటానికి మరో మంచి మార్గం ఉల్లిపాయను కోసే ముందు కత్తికి నిమ్మరసం రాయాలి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

వేడి నీటిని సమీపంలో ఉంచాలి

ఉల్లిపాయలను కోసేటప్పుడు వేడి నీటిని సమీపంలో ఉంచాలి. ఉల్లిపాయ నుంచి వెలువడే సల్ఫర్‌ను వేడి నీరు ఆవిరిని విడుదల చేయడం ద్వారా ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది. ఇది దానిని నిరోధిస్తుంది.

దీనితో పాటు ఉల్లిపాయలను కోసేటప్పుడు తరచుగా కళ్ళను శుభ్రమైన నీటితో కడుక్కోవడం ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.